కపిల రాంకుమార్ || కలాలు గళాలు ఆయుధాలవ్వాలి || తల్లీ వందనమన్న నోటితో '' నీ తల్లి! '' అన్నాడంటే వాడిపుట్టుకే కంత్రీదన్నమాట! ** స్వామి భక్తి చాటేందుకు సాటివారిపై కాలుదువ్వాడంటే వాడిది ఫ్యాక్షనిజమే! ** జనం కొరకు ప్రభుతపై పిడికిలి బిగిస్తే వాడిది సిసలైన విప్లవ మార్గమే! ** సంస్కృతి, సంప్రదాయం సాకుతో ఛాందసం వ్యాపించాలనుకుంటే వాడు కరుడుకట్టిన మతోన్మాదే! ** నమ్మకాలను నరికి మూఢనమ్మకాలుగా మార్చాలనుకుంటే నియంతృత్వ పోకడైనా కావొచ్చు! ఫాసిస్టు తత్వమైనా కావొచ్చు! ** కారంచేడు, చుండూరు ఘాతుకాలు కావొచ్చు! ఉత్తరాంధ్ర తీర రక్తసిక్త తెరచాపలు కావొచ్చు! బషీర్‌బాగ్ ముదిగొండ ఉద్యమ తర్పణాలు కావొచ్చు! ఇంద్రవెల్లి గుజరాత్ మూకుమ్మడి దృశ్యాలు కావొచ్చు! పొరపాట్లని అంటే ఒప్పుకోము! సర్కారీ జవాబు దారీని ప్రశ్నించక మానం! యాదృచ్చికాలైనా శాశ్వతా దృశ్యాలు కాకూడదు! కానీయం! ** అలాంటి చీడపీడలను వ్యాప్తిచెందకుండా కలుపు మొక్కలేరినట్లు దురంతాలను నిలువరించాలంటే కవుల, గాయకుల, కలాలు , గళాలు ఆయుధాలవ్వాల్సిందే! ** 25.4.2017...... సాయంత్రం ...6.52
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQWJtD
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQWJtD
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి