గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్ : నాకు నచ్చిన నాలుగు మాటలు గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.చంద్రునికో నూలు పోగులా ఆయన నవల లలో నాకు నచ్చిన నాలుగు మాటలు ఇక్కడ తెలుగులో అనువదిస్తున్నాను.ఇవి One hundred years of solitude ఇంకా Love in the time of Cholera నుండి తీసుకున్నవి.విస్తృతమైన జీవితానుభవం ,లోతైన పరిశీలన వానిలో కనిపిస్తుంటాయి. 1.ఎవరైనా తమ పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తారంటే కేవలం వాళ్ళు తమకి పుట్టినందుకు మాత్రమే కాదు, వాళ్ళని పెంచడంలో కలిగే తీయని స్నేహమాధుర్యం వల్ల...! 2.వివాహం తరవాత ఎంత సంతోషంగా ఉన్నాము అనేదానికంటే దానిలో ఎంత స్థిరంగా ఉన్నామన్నదే ప్రధానమైనది. 3. ఏ ఒక్కరు నీ కన్నీటికి అర్హులు కారు.అంత ప్రేమాస్పదులు ఎప్పుడూ నీ కన్నీటిని కోరుకోరు. 4.మనిషికి తాను వృద్దాప్యానికి చేరువ అవుతున్నప్పుడు అతనికి తెలుస్తూనే ఉంటుంది.ఎందుకంటే చాలా విషయాల్లో తాను తన తండ్రి లాగానే ప్రవర్తిస్తున్నాని గుర్తించడం మొదలుపెడతాడు. ------------------------------------ 26-4-2014
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhTxLA
Posted by Katta
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhTxLA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి