నరేష్కుమార్ //రాలిపోయిన నమ్మకపు గీతం// 1) అది అచ్చంగా గర్వమేనా అంటే ఏమో మరి మనిషిగా నా చుట్టూ పేరుకున్న అసహనపు పొరలకింద ఉన్న భావాన్ని ఏమని చెప్పగలనూ... మర్రి ఊడల్లా పెనవేసిన కుహనా మర్యాదల మద్య అసలెక్కడుందో మొదలంటూ భుజాన భేతాలున్ని దించి నిజాన్ని వెతుక్కోలేని తనమే అయుండొచ్చు మరి 2) ఒక్క కాగితపు చుట్టలో దాగిన పొగాకుతునకల్లా కొన్ని క్షణాలు కీబోర్డు పైనున్న వేలి కొసలని కాల్చే వరకూ తెలియనే లేదు 3) ఓహ్....! ఎక్కడో కదిలే ఉంటుందా మనిషి పైనున్న నమ్మకం కుప్పలుగా పోగుపడ్డ ఆలోచనా శవాలకు దహన సంసంకారపు మంత్ర ఘోష కి ఎగిరిపడుతున్న కర్ణ భేరీ కంపనాల కొలతల్నిప్పుడు రిక్టర్ స్కేలుపై కొలుస్తూ... ఎలా ఉండను మరి..!? 4) గడియారపు ముళ్ళు గుచ్చుకొని గాయపడ్డ క్షమాపనా పత్రమొకటి ఉదయాన్నే వెలిగే సూర్యుడికీ నాకు అడ్డుగా చెట్టు కొమ్మ పై వేళ్ళాడుతూంటే భూమి నీడలో సేదతీరే చంద్రున్ని బయటికి లాక్కొచ్చి రెండు వెలుగు రేఖలు అతని తలపాగాలో అలంకరించకుండా ఎలాగ మరి.. 5) జిగటగా కారే చీకటిని తుడుచుకుంటూ నగరపు రోడ్లపై వొంటరి గీతపు సంచారం ఇది నేనే అనుకుంటూ.. ఏమొ నేను కాదేమో అనుకుంటూ గొంతుదాటే మన్నింపు గీతాన్ని దారిపక్కనే ఉన్న బిచ్చగాడి గొంతుతో పాడుకుంటూ ఉంటే మళ్ళీ అదే ప్రశ్న ఎదురుగా నడుచుకుంటూ వచ్చి నా ముందు కూలబడుతుంది "అది గర్వమేనా..?" అంటూ ఏమో మరి జవాబెప్పటికీ చెప్పలెనేమో మరి.... 26/4/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PCL0GJ
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PCL0GJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి