"The Wolf of the Wall Street" -- పసునూరు శ్రీధర్ బాబు చెప్పకూడనివి చెప్పాలనిపిస్తుంది దాచుకోవాల్సినవి చూపించాలనిపిస్తుంది చచ్చేదాకా బతికేందుకు ఇన్నేసి రహస్యాలను కాపాడాల్సిన దౌర్భాగ్యమేమిరా దేవుడా? చీకటిలో తెరుచుకున్న రంగస్థలం మీద రహస్యాలభంజికలతో రాజుకుని మాడి మసైపోయి పొగల సెగల ఆనవాళ్ళతో లుంగలు చుట్టుకుపోతూ ఏదేదో రాసేయాలనిపిస్తుంది నెత్తుటి వెలుతురులో దుఃఖపు చీకటి అక్షరాలతో.. కోర్కెల రాత్రిలో మసిలే కన్నీటి వ్యాకరణంతో.. ఒక బ్లాక్ కామెడీ.. కరెన్సీ నోట్ల మీద కెలికేసి నలిపేసి… చెత్తబుట్టలో పారేసి- చెత్తబుట్టలు టేబుల్ కిందే ఉండవు.. లేబిల్ లేకుండా లోపల్లోపల నోరు తెరుచుకుని చూస్తూనే ఉంటయ్.. దీర్ఘాలోచనల నిట్టూర్పులను బుసకొడుతూ జుర్రుకునేందుకు- ముసలాడు మార్టిన్ స్కోర్సీస్ ఎప్పటికీ ఓ పాతికేళ్ళ తోడేలు భయపెడుతున్నాడు ముసుగులన్నీ పరపరా చింపేసి- సిగ్గుతో చచ్చిపోతున్నామిక్కడ.. వలువలన్నీ తీసేస్తుంటే.. విలువలు లేని బతుకులు తట్టుకునేదెట్లారా? టెడ్డీ బేర్ కన్ను ఆవురావురుమంటూ ప్రియురాలి రహస్సౌందర్యంలోకి చొరబడి చొంగకారుస్తుంటే.. ముక్కుపుటాలదిరేలా మాదక ద్రవ్యాన్ని మస్తిష్కంలోకి పీల్చుకున్నాక నైతికత ఒక అస్పష్ట కళాఖండం.. ఆధునిక దృశ్య కావ్యం… ‘ఓహ్… ఐ జస్ట్ కేమ్.. డిడ్ యూ?’ *** ఫిబ్రవరి, '14 (మార్టిన్ స్కోర్సీస్ చిత్రం "ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్" చూసింతర్వాత)
by Sreedhar Babu Pasunuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNRS07
Posted by Katta
by Sreedhar Babu Pasunuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNRS07
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి