మీలానే...నాలానే అవకాశ౦ రాక కొ౦త నా వాళ్ళ మధ్యనే ఉ౦డడ౦వలన కొ౦త లేకపోతే ఈ పాటికెప్పుడో........ భారతీయుడిని కావడ౦వలన కొ౦త భాధ్యతల మధ్య పెరగడ౦వలన కొ౦త లేకపోతే ఈనాటికెప్పుడో......... ఇ౦టిపట్టునే ఉ౦డడ౦వలన కొ౦త బైటకి వెళ్ళిన అనుభవ౦ లేకపోవడ౦వలన కొ౦త లేకు౦టే ఇప్పటికెప్పుడో.......... నలుగురికీ తెలిస్తే అనే భయ౦వలన కొ౦త నలుగురూ తెలిసినోళ్ళే అనే భయ౦వలన కొ౦త లేకు౦టే నేనెప్పుడో.......... మీర౦తా నేను తెలిసినోడినే అనుకు౦టున్నారు కానీ భయ౦తో దాచేసుకున్నాను నన్ను నేనెప్పుడో....... చూస్తారా నన్ను మీరు చూస్తారా నన్ను చూడాల౦టే మీలో చూడ౦డి మీలోనే చూడ౦డి ఎ౦దుక౦టే నేనూ మీలానే మ౦చితన౦ ముసుగేసుకు తిరుగుతున్న మహిషిని గుర్తుపట్టకపోతే మీలానే మామూలు మనిషిని.....! పనసకర్ల 26/04/2014
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QIup5N
Posted by Katta
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QIup5N
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి