పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

Abd Wahed కవిత

ఎన్నికల ప్రచారంలో వివిధ నాయకుల మాటల విన్యాసాలు చూసిన తర్వాత నాలుగు మాటలు రాయకుండా ఉండలేము. ప్రతిమాటకు నువ్వెంతని చెప్పడం తగునా నువ్వు చెప్పు మర్యాదను తప్పడం తగునా నాలుకపై రాజేసిన కుంపటి మంటకు కట్టెలుగా మాటలు మండించడం తగునా చెంతకొస్తె శత్రువైనా ద్వేషాలు ఎందుకు పూలనొదిలి పెనుముళ్ళను పెంచడం తగునా నెత్తుటిలో తడిసి ఒంటినతికితే దుస్తులు జేబుకున్న చిరుగుచూసి వలవడం తగునా కాలిపోతె కాయంలో మిగిలుందా మనసూ ఇక ఇప్పుడు బూడిదలను తవ్వడం తగునా నరనరాన పరుగెత్తే రుధిరాన్నే అడుగూ కంటి నుంచి రాలకుండ ఉండడం తగునా మద్యపాత్ర చేపట్టిన పదవుల రుచి మరిగి ప్రమాణాల వస్త్రాలను వలవడం తగునా మత్తెక్కిన అధికారం మూసుకుని కళ్ళు ప్రజల బాగు చూస్తుందని నమ్మడం తగునా దియా, భ్రమల నిషాలోన దాగుంది ప్రాణం కళ్ళు తెరిచి చావు వలలొ చిక్కడం తగునా

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PDtN07

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి