పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

Srinivasa Bharadwaj Kishore కవిత

ఒకానొక వానదినమునాడు, చలికి ముసుగుతన్ని పడుకుని టీవీలో సినమా చూస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన, సాధారణంగా ఆ పరిస్థితులలో అందరికీ, ముఖ్యంగా తెలుగువారందరికీ వచ్చేదే అయినా, ఆరోజు, వచ్చిన ఆలోచనను అమలుపరచడం నేను స్వయంగా, తదనంతరం నేను పడ్డ అవస్థ ఇతివృత్తంగా తీసకుని సరదాగా ఛందోబద్ధంగా వ్రాయాలని కలిగిన కోరిక ఫలితమే ఈ కవితలు . వానదినము - కైవల్యము రచన: కిభశ్రీ శ్రీనవాస భరద్వాజ కిశోర్ వృత్తం: కందం వెలుపల జోరుగ వానకు నులివెచ్చగనింటియందు నూయలనుండన్ తలపున వచ్చిన యోచన తలమునకలుచేసి నన్ను తైతకలాడెన్ ఇంచుకనైనను ఆలస మెంచక నే ముసుగుతీసి మెల్లగలేవన్ మంచినిదుర చెడగొట్టితి న౦చుపలువిధుల శ్రీమతి ననుదూషి౦చెన్ శీతలకారిలొ (refrigerator) బరిణెల మూతలతీయగ దొరికెను మోహమువెలుగగన్ చేతులు రెండిటి నిండుగ పాతవెనైనను ఘాటువి పచ్చిమిరపలున్ మూడంగుళములు పొడవువి వాడినవైనను తొడిమెలు బాగనెయు౦డెన్ వాడిగ నున్నొక కత్తితొ వీడక నడుమను చీలిచి వేరుగపెడితిన్ పండిన చింతకు జిలకర నిండుగ వామును లవణము ని౦పితినయమున్ పిండిసెనగనందుముంచి మెండుగవేయించిచేస్తి మిర్చీబజ్జీ యేమని చెప్పను రుచినిం కేమని పొగడుదు మిరీ్చకేదికపోటీ నామనసొప్పదుప౦చగ ఈమని శ్రీమతి అడిగితె యేమనిచెప్పన్ వీసిన సనజాజిపూల వాసన మరిపింపజేయ వచ్చినవాటిన్ మూసిన కన్నుల తోడనె వేసినవటు వేసినట్లు వేసుకుతినగన్ కారెను నా కంటనీరు మారిక నోరగ్నిగుండమైనను మరి నేన్ భీరుడకాదలచక గం భీరముగిం కొన్నితినగ భీతియెలేకన్ (గంభీరముగ ఇంకొన్ని తినగ) కాననిచోటెల్లమంట తోనిక నాతంటాలకు తోడుగనయ్యెన్ లోనికి బైటికి పరుగులు కానుకగా పొందితినే కైవల్యంబున్ చెప్పిన వినన౦దుకుఈ తిప్పలు తప్పవు పొమ్మని తిట్టితరుణినా తప్పడు పనులకు శిక్షగ చప్పిడికూడేఈరోజనితీర్పిచ్చెన్

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QOhFKr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి