పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఆగస్టు 2012, ఆదివారం

మెర్సి మార్గరెట్ ll నేను మనిషినే ll

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి
అన్నం కోసం తన్నుకునే
వారిని చూసి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు ..

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి
అమ్మ ముసలితనం భారం అని ..
నాన్నకు వృద్దాప్యం నాకెందుకని
వ్రుద్దశ్రమాలలో వదిలిన వారిని చూసి
హృదయం తల్లడిల్లినప్పుడు

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి
ప్రాణమైన చేతి వృత్తులు ..
వ్యవసాయం ఆగిపోయి
ప్రాణమే వదిలి ప్రేమ చాటుకున్న వారి
శవాలను చూసి గుండె ద్రవించినపుడు..

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి
దేశంకోసం తపనపడి శత్రువులను
తరుముతూ అమరులైన వారి గుండెల్లో
దూసుకెళ్ళి తూటాలు .. వారి దేహాలను
చూసి శిరస్సు నాకు తెలియకుండానే వంచి
కన్నీటి నీరాజనాలు రాల్చినప్పుడు ...

నేను మనిషిని అనే ఆనవాళ్ళు దొరికాయి
నా గుండె ప్రేమకి స్పందించి
నన్ను నేనే ఆజ్యంగా పోసుకోగలనని
ఆత్మ గోషిస్తూ చేసిన ప్రబోదానికి
శిలలాంటి హృదయం కరిగి ...
నేనైనా శిల కన్నీటిని వర్షించినప్పుడు
....................(24/8/2012)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి