పాపాయి బొమ్మేసే సరికి ఆకాశం తెల్లబోయింది
నక్షత్రాలు ఎర్రబడ్డాయి
కొన్ని పోల్కా డాట్స్ బాగా కలిసిపోయి చందమామ నవ్వేసింది
నీలి కాంతుల నీరు, పసుపు పొలుసుల చేపలు, సీతాకోక చిలుకలు,
ఏవేవో లోకాలు, ఇంకా... ... ఏం కావాలనుకుంటే అవి అయిపోయాయి
పాపాయి ఏం చేసినా నక్షత్రాలకు, చందమామకు
ఎందుకంత ఇష్టం, ఆకాశానికి ఎందుకంత ఆశ్చర్యం,
వేణువు విన్న గోవుల్లా దిగి వస్తాయెందుకు లోకాలు
కన్నీటి వంటి నీటి రంగులతో తడిసిన కాగితాలను తొక్కుకుంటూ
పాపాయి వేలు పట్టుకుని బయటికి వెళిపోయి, ఆకాశాన్నిఅడిగాను
ఎవరో అలవోకగా విసిరేస్తే రక రకాల రూపాలు ధరించిన మేఘాలు
గాలికి కొంచెం నవ్వి చెప్పాయి
‘ఇంకా పైన ఉన్నాడో లేడో మాక్కూడా తెలియదు గాని, ఉంటే గింటే,
భగవంతుడు పాపాయిగానే ఉంటాడు’: ఆ తరువాత
నాకెవరితో ఎలాంటి పేచీ లేదు, భగవంతుడితో కూడా
పేచీ గీచీ వుంటే పాపాయిగా ఉండని అధికారి తోనే
పాప పుణ్యాల నిర్వచనాలతోనే, పుక్కిటి పురాణాలతోనే
25-8-2012

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి