శృస్టిలో
జంతువుల ఆత్మహత్యలు
స్వజాతి జంతువుల అకారణ హత్యలూ
లేనప్పుడు....మనిషెందుకిలా.....!!!!!!!
దక్ష ప్రజాపతి దయాహీనత
ఆదిశక్తి ని దహనం చేసి
ఆత్మహత్యకు శ్రీకారం చుట్టింది
మొ
ద
లు
అత్తలఆరళ్ళు కోడళ్ళను
పాడుబడ్డ బావిలోకి ఉరికో
పాత చీర కొంగు వురికో
బలిచేస్తున్నాయు
శవాల కంపు కొడుతూ
నిత్యం చచ్చి బ్రతుకుతున్న
జనాల మద్య ఇమడలేక
పసిబిడ్డలతో సహా కుటుంబాలు
జనాబా లెక్కల్లొంచి తప్పించుకొంటున్నాయు
నేతలే గోతులు తీస్తుంటే
మగ్గాలకు వురిపగ్గాలేస్తుంటే
బట్టల మిల్లులు బ్రతుకుకు చిల్లులు పెడితే
విధిలేక వేరే లోకాలకు వలసలు పోతున్నారు
డంకెలు రంకెలకు
అప్పుల వేలం డప్పుల చప్పుళ్ళకు
తనుపండించినపత్తే దీపం వత్తులై
రైతన్నల నెత్తి మీద వెలుగుతున్నాయు
మనసులు కలసినా మనుగడ కరువై
మనువు తమ మనువుకు అడ్డం పడుతుంటే
సమాంతర రేఖలుగా జీవించలేక
రైలుపట్టాల సాక్షిగా తలలు తెగిపడుతున్నాయు
బడివత్తిడిలో వాడి
నాన్నా నాకెందుకో బ్రతకడం ఇస్టం లేదంటూ.....
ఏకవాక్య వీలునామాలు రాస్తూ....
భవంతుల పైనుండి దూకి
పసిమొగ్గలు ఉసురుతీసుకొంటున్నాయు
రాజకీయ క్రీడలో
ఆశలు తీరే దారులు మూసుకు పోతున్నప్పుడు
నవయువకులు బలిదానాలవుతున్నారు
ఈతి ్బాధల మరణాలను
ఏనేతల చావులకో జతకట్టి
బ్రతుకెళ్ళదీస్తున్నారు మిగిలిన అందరు
్
ఆత్మహత్య
పిరికితనమో
పరువుతనమో
వీరత్వమో
ధీరత్వమో
అనివార్యతో
అని చేయుటో
అల్పత్వమో
మనుషుల తత్వమో
అంటూ పద్దులు రాసుకొంటున్నాం
అవన్నీ పాలకుల పాతకాలనిమరచిపోతున్నాం
ఆత్మహత్యలు కావవి
మనదేశం
మే
ధా
వు
ల
మౌ
నం
చేస్తున్నహత్యలు
కవిమిత్రులారా కలాలు పట్టండి
ఇకనయునా మేధావుల మెదళ్ళకు నోళ్ళు పెట్టండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి