1. కవి ఏదైన కవిత రాయాలనుకున్నప్పుడు దానిపై తనకి కచ్చితమైన అవగాహన ఉంటే ఏ పదాలను ఏ సందర్భంలో వాడుతున్నాడో తెలుస్తుంది, మంచి స్పృహ ఉంటుంది కవిత మీద
2. కవికి తనేం చెప్పదలచుకున్నాడో సరైన అవగాహన లేనప్పుడు తనకే సందేహంగా ఉంటే పదాల్లో అర్ధాల్లో తత్తరపాటు బయలుదేరుతుంది. అప్పుడు ఎవరు ఎదురుపడి ఏం చెప్పినా మారుస్తూ పతారు.... అంటే ఆ కవి కవిత అర్ధం మార్చేస్తున్నడు. కవి చెప్పాలనుకునే విషయంపై సమగ్ర అవగాహన లేకపోవడం వల్లనే సవరణల అవసరం ఏర్పడింది.
3. పాఠకుడు (కవి , సాహితీ ప్రియుడు, సాహిత్య విమర్శకుడు లేక సాధారణ వ్యక్తి) ఒక కవితను చదివి ఎంతో కొంత అర్ధం చేసుకుని, అరరే ఇది ఇలా రాస్తే బాగుండేది అని సూచనలివ్వాలనుకుంటారు కారణం ఇక్కడ రాసిన కవి చదివిన పాఠకులు భిన్నమైన ఆలోచనా విధానాలు, సామాజిక పరిస్థితులు, మానసిక పరిణతులు కలిగినవారు కావడమే. ఒకవేళ వారికి అన్ని విషయాల్లోనూ సారూప్యత ఉంటే మనసుల దృష్ట్యా విభేదించవచ్చు.
4. కవి వ్యక్తీకరించాలనుకునే భావన సరిగ్గా పాఠకునికి చేరాలంటే కవికి భావ స్వాతంత్ర్యంతో పాటు పదప్రయోగ స్వాతంత్ర్యం కూడా ఉండాలి.
5. చదివిన కవితకి ఏమైనా సవరణలు సూచించాలి అనుకుంటే అప్పుడు కవి హృదయంలో ఏ భావ ప్రకటన ఉద్ధేశముందో తెల్సుకుని, సూచనలు మాత్రమే ఇవ్వాలి. అవి కవికి ఆమోద యోగ్యమైతే సవరిస్తాడు లేదంటే లేదు.
- వర్ణలేఖ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి