నిద్ర గుటిలో దీపం
దీపంచుట్టూ పురుగులు
ఎన్ని కధల మీద రెక్కలు పరుస్తాయౌ.
౨
సవరించడం మొదలుపెట్టాయి
కాగితాలు ఎగరడంతో అక్షరాల పావురాళ్లు వాలుతున్నాయి
కువకువ లాడుతూ గునగునా నడుస్తూ
నిద్ర రెప్పలపై పొడుస్తూ గింజలు ఏరుతున్నాయి
మసక వెల్తురులో ప్రేమలేఖని వెతికిపట్టుకున్నాయి
చేతిలోంచి జారిపోయిన అద్దం ముక్కలుగా అక్కడ
ఓడి పోయిన ప్రేమ పగిలిన ముక్కలలో ముక్కలుముక్కలుగా
మండుతున్నచితి మసగబారిన కళ్ళలో ఎర్రటి జీర
అమ్మ ముఖం-
ఎర్రటి సూర్యుడిని ఆహ్వనించడం మరచిపోయిన ఆకాశం
౩
రెక్కలు కట్టుకుని ఇనుప పక్షి కడుపులో దూరి
సముద్రాలు దాటి పగలుని రాత్రి
రాత్రిని పగలుగా పేనుకుని కుశల ప్రశ్నలు
తీగలమీద వరుసగా కుర్చున్నపిట్టలు.
చెవిలో ఒకదాని వెంట ఒకటి అడుగుతూనే వున్నాయి
ఒకరి చేయిని ఒకరు ఆసరాగ పెనవేసుకుని
జీవితం వరదలో కొట్టుకుపోయి
మనసు లేని ఆల్చిప్పలు
పక్కమీదోర్లుతుంటే
నిద్రరాని గూటిలో దీపం కొడగట్టడానికి
తెల్లవార్లు రెక్కలపురుగుల్తో పావురాళ్లతో యుధం చేస్తూనే వుంది ...
25-8-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి