పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఆగస్టు 2012, ఆదివారం

కర్లపాలెం హనుమంత రావు ॥ మరికొన్ని ఆలోచనా శకలాలు ॥


1
మనసారా
ఏడ్చి చూడు
కురిసే మబ్బు కష్టం తెలిసివస్తుంది

2
పిల్ల్లలు వెళ్ళిపోయిన ఇల్లు
పిట్టలు ఎగిరిపోయిన చెట్టు

3
సూర్యుడి చుట్టూ
తిరక్కపోతే
భూమికి కాలం తెలీదు

4
మనిషిని
దేవుడు
నామినీగా ఉండమన్నాడు
మనిషి
దేవుడికి
బినామీగా మారాడు

5
స్వర్గం
వర్గమూలం
సంతోషం

6
దారి ఉన్నా
నీళ్ళలో నడవడమే
బాల్యం

7
పురుగును చంపని
మందు
రైతుని చంపింది

8
చివరి
బడిగంట
చిన్నారులకు ఎంత ఆనందమో!

9
వృద్ధాప్యంలో
కొడుకు
చిల్లులు పడ్డ గొడుగు

10
లివింగ్ సర్ట్ ఫికేట్ కోసం
పోతూ
ప్రమాదంలో పోయాడు

11
కచేరీ ఐపోయింది
తల ఊగుతూనే ఉంది

12
ఒక
పండు నేల రాలి
పది మొక్కలకు ప్రాణం పోసింది

13
ఎంత ఆకాశమైనా
గబ్బిలానికి
కాళ్ళ కిందే!
24 August 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి