పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఆగస్టు 2012, ఆదివారం

కాపీ ‘‘రైటు’’ కాదు : అది తప్పే


మిత్రులారా.. పారాహుషార్!!
కవిసంగమం నుండి కవితలు కాపీ చేసి వారి పేరుతో వారి వారి వాల్స్ పై పేస్ట్ చేసుకుంటున్నారు.
నిజంగా చాల బాధాకరం! చేతిలో పర్సూ, ఏటీఎం లో డబ్బూ..
ఒంటి పై బంగారం దొంగిలించేస్తే...బాధ పడి వారి పాపాన వారే పోతారని సరిపెట్టుకుంటున్నాం..!!
కానీ... హ్రుదయం స్పందనల్ని కలం జాలువార్చే అక్షర సుమాల్ని, మనసు పొరల్లోంచి పురుడు పోసుకున్న కవితల్ని కూడా దొంగిలించేంతటి..
దౌర్భాగ్యుల్ని యేమనాలి? యేమంటే బాగుంటుందో మీరే చెప్పండి..!!





    • Mercy Margaret it happend wiht me too .. but we cant do anything on this ..


    • Anil Dani valla URL ivvagalaraa andiplz


    • Kiran Gali If some one steals the lines and posts them as their own also, the poet should feel proud that his/her writing was liked by that individual so much that he/she opted to convey it as own. Indirectly it helps the poem spread even further :) . The truth will prevail in the end anyways.



    • Katta Srinivas అనిల్ గారు అడిగినట్లు మీరు గమనించిన ఉదాహరణను దొరికితే యూఅరెల్ ఇవ్వండి.



    • Kodanda Rao I agree with Kiran Gali brother... భావ చౌర్యం ఈ నాటిది కాదు. నాకు తెలిసింది సినిమా సాహిత్యం ఒక్కటే. అందులో ఇలాంటివి చాలానే చూసాను.మన ఆలోచనలని వేరేవాళ్ళు దోచుకున్న, దాచుకున్న గర్వమే...



    • Jagathi Dhaathri is it chaa adentee pl trace them out ..vallu mee peruthone share chesukunte parvaledu ledaa valla perutho chesukuntene we can accuse them pl see to it Kavitha Chakra love j



    • Padma Sreeram 
      ఇది నా విషయం లో చాలా సార్లు జరిగింది.వాళ్ళ బ్లాగ్స్ లో వాల్ళ పేర్లతో నావి 3 కవితలు సగాలుగా ముక్కలు చేసి మరో మూడు కవితలుగా రూపించి పెట్టెుకున్నప్పుడు చాలా బాధపడ్డాను...ఇక్కడ కూడా వచ్చిన కొత్తలో ఒక కవిత చూసి ఎక్కడో పరిచయమైనట్లుందీ అనుకుంటే న...See More



    • Katta Srinivas Google counter check చేసికూడా చూడొచ్చు.
      మీ కవితలో కొంత బాగం ముక్కలుగా గూగుల్ సెర్చ్ లో వేసి చూడండి.
      ఎక్కడెక్కడ రిలవెంట్ పోస్టులున్నాయో రిజల్లుగా చూపెడుతుంది.

      రెండోది మీరు బ్లాగులలో పోస్లు చేసేప్పుడు కాపీ చేస్తారేమోనన్న భయం వుంటే.
      రైట్ క్లిక్ డిసేబుల్ చెయ్యండి. అందువల్ల ఇక మీ బ్లాగుల నుండి కవిత్వాన్ని తీసుకునే అవకాశం వుండదు.

      కాకపోతే ఈ తస్కరణ, ప్లాగియరిజం లున్నాయన్న సందేహం కొత్తవారిని పోస్లుచెయ్యకుండా భయపెడుతుంది.

      ఎన్ని చేతికర్రలను సపోర్టుగా తీసుకున్నా వెన్నెమకలేనివాళ్లు ఎప్పటికీ నిలబడే వుండలేరు.



    • Kiran Gali ‎"ఎన్ని చేతికర్రలను సపోర్టుగా తీసుకున్నా వెన్నెమకలేనివాళ్లు ఎప్పటికీ నిలబడే వుండలేరు" beautiful quotation Katta Srinivas garu



    • Prakash Mallavolu Kavitha Chakra jee, @all.......
      నేను గత ఒకటిన్నర సంవత్సరాలు గా ఎన్నో ఎన్నెన్నో కవితా చోర్యాలు చూసాను... కేవలం నావే చాలా సార్లు వేరే వాళ్ళ పోస్టింగ్స్ గా చూసాను.

      నాకున్న మిడి మిడి జ్ఞానంతో ప్రతి సారీ నేనొక విధంగా స్పందిన్చేవాడిని..

      నా కవిత url ని కాపీ చేసి అక్కడ పోస్ట్ చేసేవాడిని.
      కొంత మందికి "నా కవితని షేర్ చేసుకున్న౦దుకు ధన్యవాదాలు. ఇక నుంచి షేర్ చేసుకునేటప్పుడు రచయితా పేరు కూడా తెలుపండి" అని.....

      నావే కాదు సహా మిత్రుల రచనలు కనపడితే ఇలాగే ప్రవర్తించే వాడిని .

      ఒక వేళ ఎవరి రచనో తెలియకపోతే..,
      ఒకళ్ళ URL ఇంకొకరి దగ్గర పోస్ట్ చేసేవాడిని.

      చాలా వరకు బుద్ది తెచ్చుకునే అవకాశం ఉంది అలా చేస్తే....
      కొంత మందినైతే సహా మిత్రులందరూ చులకన గా చూడడంతో కాళ్ళ బేరానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా అనుభవం లో...

      ఖచ్చితంగా ఖండించాల్సిందే ఇలాంటి చర్యల్ని...

    • Katta Srinivas స్వంత బ్లాగులు వున్న వాళ్లు రైట్ క్లిక్ పనిచేయకుండా చేసేవిధానం ద్వారా
      మన బ్లాగులోని కవితలను కాపీ చేయకుండా కొంతవరకూ కాపాడుకోవచ్చు.
      కావలసిన వారికోసం ఆ విధానం ఇస్తున్నాను చూడండి. నా బ్లాగులో (http://antharlochana.blogspot.in/ ) కూడా ఈ కోడ్ ప్ర
      యత్నించాను. బాగానే పని చేస్తొంది.
      1) Log into your blogger dashboard.
      2) Navigate to your blog’s Layout >> Page Elements page.
      3) Now add a new widget by navigating to Add a Gadget >> HTML / JavaScript
      4) Add the following code to HTML / JavaScript box.

      http://www.beinggeeks.com/wp-content/uploads/2011/11/code.txt )



    • Padma Sreeram శ్రీనివాస్ జీ...ధన్యోస్మి....




    • Bvv Prasad 
      Katta Srinivas మీ సలహా అనుసరించాను, మీ బ్లాగ్ లో లాగే, నా బ్లాగ్ లోనూ, రైట్ క్లిక్ డిసేబుల్డ్ అని వస్తుంది. దీని ఉపయోగం అర్థం కాలేదు. మీ బ్లాగ్ లో కవిత స్క్రాల్ చేస్తూ సెలెక్ట్ చేసి, కాపీ చేసి, లేఖినిలో పేస్ట్ చేస్తే, పేస్ట్ అయింది. తస్కరు
      లు ఇలా చేయవచ్చు కదా.

      నా మరొక సలహా ఏమంటే.. కవిసంగమం పెద్ద గ్రూపు గనుక, చదువరులు ఎవరైనా, ఇలాంటి తస్కరులని గమనించినపుడు, వారిపేర్లు ఇక్కడ ప్రకటించటమూ, అది సమస్య అయితే, అడ్మిన్ కో, మరెవరైనా కార్యవర్గానికో, ఆ పేర్లు మెసేజ్ ద్వారా తెలియచేసి, అందరికీ పంపమనటమూ. దీనివలన నిఘా పెరిగి, అటువంటి అల్లరి తగ్గుతుంది.

      లేదూ, కిరణ్ అన్నట్టు పాజిటివ్ గా తీసుకొని ఊరుకొంటే మంచిదేమో.

    • 1) రైట్ క్లిక్ డిసేబల్డ్ కావటం దాని ఉపయోగం మౌస్ ద్వారా కాపీ, లాంటి కమాండులను ఉపయోగించే అవకాశం ఉండదు.

      2) మీరన్నట్లు సెలక్ట్ + కంట్రోల్ సీ ద్వారా చెయ్యెచ్చు కావాలంటే మరో కమాండ్ ద్వారా దాన్నికూడా ఆపోచ్చు అప్పుడు ప్రింటుతీసుకునో,
       పెన్నతో రాసుకునో, ప్రింట్ స్క్రీన్, తోనో, సేవ్ యాజ్ ఇలా తస్కరించాలనుకున్నవాళ్లు చేసే అవకాశంవుంది.
      శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు. అడ్డదారులకేం కొదువలేదు. అంతర్గత క్రమశిక్షణ లేనప్పుడు.

      3) వారి గుట్టు బయటపెట్టి రచ్చచేసి కుంచించుకునేలా చేయటం బానే వుంటుంది. సరాసరి దొంగిలించేవారికి. మొత్త అలాగే తీసుకుంటే కాపీ,
      రెండుమూడు ముక్కలు తీసుకుని మరోగ్రూపులో పోస్టటం క్రియేటివిటీ,
      అక్కడకొంచెం అక్కడ కొంచెం తీసుకోవటం రీసెర్చి.
      ఇలా వుందండీ. భావ చౌర్యం.

    • Bvv Prasad Katta Srinivas అడ్డదారులకేం కొదువలేదు. అంతర్గత క్రమశిక్షణ లేనప్పుడు. అవును. కుంచించుకు పోయేలా చేద్దామనీ కాదు, ౧. నిజ రచయిత చూడరన్నపుడే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది, వాళ్ళ కంట పడుతుందంటే ఆ ఆలోచన ఆగుతుంది. ౨. అలాంటివాళ్ళు ఎక్కువమంది ఉండరు, వాళ్లెవరో తెలిస్తే, అందరూ వాళ్ళని గమనిస్తూ ఉంటారు.



    • Katta Srinivas Bvv Prasad సర్ నిజమే .. పిల్లుల మెడలో గంటలు కట్టాలిక.
      ఈ చర్చను ముందుకు తీసుకురావటం వలన కూడా కొంత జాగ్రత్త పడే అవకాశం వుంది. Kavitha Chakra గారికి అభివందనాలు. ఈ నిఘా కొనసాగుతూ వుండటం మంచిదే.



    • Krishnabaalu Baalu గుడ్ బయ్ ఇంక సెలవు ఈ విదంగా కాపీ చేస్తుపోతే ఇక్కడ సొంత కవితలు పోస్ట్ చేయడం మూర్ఖత్వం


    • Katta Srinivas Krishnabaalu Baalu సార్ నిజంగా ఇలాంటి మనస్థితి కొత్తగా ఉత్సాహంగా రాస్తున్న మిత్రులలో రాకూడదు. అటువంటి దిశగా మనచర్చ నెట్టుకెళ్లకూడదు. ప్రతిచోట కొన్ని అవరోధాలూ అడ్డదారులూ ఉంటూనే వుంటాయి. దాటుకుంటూ వెళ్లాల్సిందే కానీ కూలబడిపోమ్మని చెప్పకూడదుకూడా. చాలా అరుదుగా కనిపించే విషయం ఇది దానికోసం అసలు పబ్లిక్ గా కవిత్వాన్ని చూసనేకూడదని దాచేస్తామా.
      ముందుకే వెళదాం.. ఉత్సాహాన్ని సమాధికానివ్వద్దు.



    • Bvv Prasad Kavitha Chakra ఒక ఎరుక కలిగించారు అందరికీ. ధన్యవాదాలు.



    • Karlapalem Hanumantha Rao అనుకరణకి మించిన ప్రశంస లేదంటాడు చార్లీ చాప్లిన్. ఆ లెక్కన ఏకంగా ఈ అపహరణను ఇంకేమనాలో!



    • Krishnabaalu Baalu Katta Srinivas మీరు చెప్పింది నిజమే కాని నాhttp://www.poemhunter.com/poem/a-saint-in-trouser/చుడండిఅక్కడ కాపీ రైట్ అనేది గొప్ప నేరం ! నా ఇంగ్లీష్ కవితలు ఇక్కడ ఇటువంటి పనులకు ఆస్కారం లేదు



    • Katta Srinivas సహ్రుదయంతో పరిష్కారం దిశగానే నడిపించండి సార్ పెద్దలందరూ.
      భయపడితే పలాయనంలో పడిపోతాం.
      కాపీ చెయ్యకుండా ఏంజాగ్రత్తలు తీసుకుంటున్నారు.
      నేరం అనేంత మంచి సంస్క్రుతి ఎలా పెంపోందించారు. కొన్ని సూచనలు ఇవ్వండి.
      ఒకదగ్గర సాధ్యమయిన పని సరైన ప్రయత్నం చేస్తే మరోదగ్గరా సాధ్యపడే అవకాశం వుందికదా.



    • Bvv Prasad ఇక్కడి కవితలు ఇక్కడ కాపీ కొట్టటంలేదు. ఇక్కడివి మరోచోటికి తరలించబడుతున్నాయి. అది కదా చర్చ?


    • Kavitha Chakra Bvv Prasadgaru..tharalincha baduthunnai..copy chesina vaariperutho!

      పూర్తి చర్చను క్రిందిలింకు నుండి చూడవచ్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి