మంచుగడ్డని తాకి చూస్తే
కఠినంగా ఉంటుంది.
దానికి నీ చెవిని ఆనించి చూడు
...లోపల ఉన్న జల హృదయం వినిపిస్తుంది.
సుడిగాలి విజృంబిస్తే
నీ నడక అగమ్య గోచరం.
దాని పురాణ జీవితం గమనిస్తే
లాలించే పిల్లగాలుల కధలు చెబుతుంది.
అలా,అలా పేజీలు తిప్పితే
శాస్త్రం వంటపట్టదు.
ప్రతీ పంక్తిలో మునకలేస్తేనే
అక్షరాల ప్రఘాడత్వం ఆవిష్కృతమౌతుంది.
చిన్నపిల్లలు చిందులేస్తే
చిరాకు పడకు.
వాటిలో ఎన్ని రానున్నకాలంలో
రాజ్యాలు ఏలనున్నాయో???
సమాంతరంగా నడిచే కాలమే సాక్ష్యం చెబుతుంది.
అలవోకగా చూస్తే అన్నీ అంతుపట్టవు
పరిశీలించాలి.... కాస్త లోతుగా
ఎంత ఎత్తైన మేడలైనా,
వాటి మూలాలు
అడుగున పడి ఉన్న పునాదులే.
Date: 25.08.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి