ఆశ లేదు!
గాలి వీస్తే తప్ప
నిప్పు రాజుకోదు
మంట అంటుకోదు!
ఉప్పెన వస్తే గానీ
సముద్రం శిగమూగదు
ఊరు కొట్టుకుపోదు!
ఉష్ణోగ్రత మైనసుల్లోకి మారితేనే
మంచు గడ్డ కట్టేది
దవడ గడగడా వొణికేది!
రోకళ్ళు పగిలే రోహిణి కార్తెలోనే కదా
వడగాడ్పులూ
పిట్టలు రాలిపోవడాలు!
అంతు చిక్కని సృష్టి రహస్యాలు సైతం
అంతో ఇంతో అవగతమవుతాయి
కానీ,
నేనెప్పుడు పాటల ఊటనవుతానో
మరెప్పుడు మాటల చెర్నాకోలనవుతానో
తెలీని ఆమెకు-
డైలమా డైనమైట్లతో సహవాసం...
బ్రతుకంతా దినదిన గండం!
*3.7.2012
*డైలమా డైనమైట్లతో సహవాసం...
రిప్లయితొలగించండిబ్రతుకంతా దినదిన గండం!*
U reminded me of my father..
he too was a dilemma dynamite..
Can see *Ame* in my mother..
short and sweet one.. mee kavita