పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

శ్రీనివాస్ వాసుదేవ్॥నువ్వెళ్ళిపోతావ్...॥


(ఓ మాయమైన ఆలోచనకోసం)

నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలి

పాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నా
గొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలా
ఇరుక్కుందన్నా మాయమైతావు,
ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొ
వెతుక్కోమంటూ!

నిశ్శబ్దంలోపల తవ్వుకుంటున్న సమాధిలోనొ
క్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొ
నువ్వు కన్పడతావనుకున్నా!

అనిద్రలో ఉన్న మందారం
నన్ను కాదని వెళ్ళిపోయిన నిట్టూర్పు
స్వేచ్చని రెక్కల్లో దాచుకున్న పక్షుల కువకువల్లో
నీకోసం వెతుకులాట.....

అసంబద్ధపు నీడల్లోనో , అసమంజసపు గుడ్డల్లోనో
ఇరుక్కుపోయింటుందని నిర్లజ్జగా చూస్తుంటా
నా మాయమైన ఆలోచనకోసం....
నానీడలాంటి ఆలోచనకోసం

ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ

గడ్డకట్టించే ఆలోచనకోసమొ
ఆకలికి, అసమానతలకి అడ్డంపడే
రక్తం చిందించని శిలువకోసమో!

నా నిరీక్షణ ఇలా
ఈ అస్తవ్యస్త అక్షరాలలో
నా ఆలోచనల వెతుకులాటలో....

*published date ???

4 కామెంట్‌లు:

  1. *నా నిరీక్షణ ఇలా
    ఈ అస్తవ్యస్త అక్షరాలలో
    నా ఆలోచనల వెతుకులాటలో....*

    Unrest in letters..very emotional Dev ji!

    నిరీక్షణ లేనిదే విరహం లేదు..
    విరహం లోనే వెతుకులాట..
    ఆలోచనల సమాగమం..
    అంతం కన్నా అన్వేషణే ఆనందం మనకు

    రిప్లయితొలగించండి
  2. ధన్యోస్మి జయాజీ...అన్వేషణ ఓ తియ్యని బాధ విరహంలాగనే...నిరీక్షణ, విరహం అన్వేషణ ఈ మూడింటినీ కలిపి ఓ మంచి ఆలోచన చేసారు.

    రిప్లయితొలగించండి
  3. Dev ji.. మీ కవితలోని భావం నుంచి పుట్టిన.. చిరు భావన

    రిప్లయితొలగించండి
  4. 'ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
    చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
    నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ...' బావుందిభావం. ఇలా అక్షరాలలో!
    ఆర్.దమయంతి.

    రిప్లయితొలగించండి