పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

జయశ్రీ నాయుడు॥కాలం ఎటుపోతుందో తెలియదు॥

అలజడికి నేను కొత్త కాదు..
తడబాటుకు పెదవీ దూరం కాదు
ముచ్చట్లలో మెరుపు తీగల్లే
కాలం ఎటుపోతుందో తెలీదు

పేజీలు తిరగేసి
పదాలు అలుకుతూ
ఆనందపు చుక్కలు
ఆలోచనల ముగ్గుల్లో కలుపుతున్నా

నీదవని ఉదయం లేదు
ముచ్చట పడుతూ
సవరించుకునే అంచల్లే...
హృదయం లో నీతోనే ఉదయం మరి..

ప్రతి పోగులోనూ
దాగిన స్వప్నాలు
మెరుస్తూ మురుస్తూ..
అద్దకంలా అద్దంలా
అందంలా..

 *7-07-2012

2 కామెంట్‌లు:

  1. "అలజడికి నేను కొత్త కాదు..
    తడబాటుకు పెదవీ దూరం కాదు", "ప్రతి పోగులోనూ
    దాగిన స్వప్నాలు" కవితాత్మకం.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భావం పదాల్లోకి తర్జుమా అయిన

      ఆత్మ అద్దం లో అగుపించినట్టుంటుంది..

      ఆ అనుభూతి కోసమే ఎదో ఒకటీ రాస్తూనే ఇలా...

      Thank you Dev ji..

      తొలగించండి