పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

పులిపాటి గురుస్వామి - కవిత

గుజ్జలాం ......(గులాబ్ జాం)

దాడీ...
ఒక*టోరి చెప్పనా!...(స్టోరి)

వొక రాజుంటడంట
మూడమ్మాయిలు
పెద్దబ్బాయి
వాళ్ళ కాకి ఫ్రెండు
అయితే....ఆకలేస్తది
ఎపో.!.నువ్వు నవ్వుతున్నవ్ ...చెప్ప

ఎప్పుడు ఇంట్ల *చుక్కోవు (*కూర్చోవు )
వుండొచ్చు గా...
పీజ్ దాడీ
*లీల్లల్ల ఆడను (*నీళ్ళల్లో)
*ఓంకం మంచిగ చేస్త (హోంవర్క్)

ఇన్ని *బుస్కులల్ల (బుక్స్)
ఏమున్నది దాడీ
ఏబీసీడీ లేనా ?

కోoప మొచ్చిందా ?
సారీ...
ఊకె కోమ్పమెందుకు
మమ్మీ *ఈనకు..... (ఈయనకు)

మూతట్ల పెట్టినవ్?
ఏమైంది *పాచీ ! (పరిచయ)
అల్ల(ర్) చేయకు
*నరకాలా!.. (నకరాలా)

తొండకు
ఆళ్ళ మమ్మీ దాడీ లేరా ?
ఎప్పుడొక్కటే చెట్టు మింద ...

*బకడీ ఆడుకుందామా దాడీ (కబడ్డీ)
పోనీ *దొక్కిచ్చుకునే ఆట (దొరికిచ్చుకునే)
*దాతురూమ్ల (బాత్ రూంల)
*దెద్ రూంల దాచు కోవద్దు (బెడ్ రూంల )

ఈ బుక్కేసుకో
కమ్మగుంది కదా !
మమ్మి నాకిష్టం
నువ్వు కూడా ఇష్టం దాడీ ...

ఎప్పుడు బస్సులనే
(స్)కూల్ కు పోవాలా?
*ఎంపపాల్ ల పంపొచ్చుగా....! (ఏరోప్లేన్)

రేపు నా *బత్తుడే (బర్త్ డే )
*జిక్కుటు తేక పోయావో (గిఫ్ట్)
ఒళ్ళు *చింత పత్తైత(ద్) (చింత పండు)

నీకో *చాకెటి స్తా (చాక్లెట్)
పండ(గ్) చేస్కో
ఓ పోయెం రాస్కో ....

.....
మిత్రులారా!ఇది మా నాలుగు సంవత్సరాల "ఆనంద స్వామి",
ఉండాల్సిన చోట ఒత్తులు జార్చుకొని ,అవసరం లేని చోట అలంకరించుకొని ,కిమ్మనక ఒదిగిపోయిన బాల్యం భాష.....పదాలు,వాక్యాలు వాడివే .....
నేను కూర్పరిని మాత్రమే,
వాడి పుట్టిన రోజుకై....ఈ రోజు 
*4.7.2012

2 కామెంట్‌లు:

  1. పులిపాటి గురుస్వామిగారూ,
    నా దృష్టిలో ఇది చాలా అపురూపమైన కవిత. పిల్లల నిష్కల్మషమైన అనుభూతుల్లోంచి వచ్చిన మాటలను ఒడిసిపట్టి వ్రాసిన కవిత. ఇది తియ్యని పలుకుబడితో ఎంత అందంగాఉందో చెప్పలేను. ఎన్నిసార్లు చదివినా నాకు మీ పిల్లడి బుంగమూతి ("నే చెప్పను ఫో") ముద్దుపలుకులూ, మెరుస్తున్న కళ్ళూ కళ్లముందు కదలాడుతున్నై.
    మీకు నా మనః పూర్వక అభినందనలు

    రిప్లయితొలగించండి
  2. ఇప్పటికీ కవిత పదోసారి చదవటం..నిజానికి కంఠతా వొచ్చేసింది కూడా..ప్రతీ పదంలోనూ కోల్పోయిన బాల్యం గుర్తుకుతెచ్చారు. ఇంతకంటే కవిత్వానికి ఏం కావాలి? అభినందనలు స్వామీ గారు.

    రిప్లయితొలగించండి