పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మార్చి 2014, మంగళవారం

Vakkalanka Vaseera కవిత

. 80వ ద‌శ‌కంలో రాపజ‌మండ్రిలో సాహితీ వేదిక అనే ఓ సంస్థ ఉండేది. దానివ్య‌స్థాప‌క స‌భ్య‌ల్లో మ‌హేష్ ఒక‌రు. ఇది చ‌క్రాల వెంక‌ట సుబ్బు మ‌హేష్ అనే ఓ సాహితీ మిత్రునితో నా అనుబంధం గురించి. స‌హితీ వేదిక‌తోనూ దానిలోని మిత్ర‌బృందం తో అనుబంధం నాకు క‌విత్జీవ జీవితానుభ‌వాన్నిచ్చింది. ప‌దిరోజుల క్రితం సెల‌వంటూ శాశ్వ‌తంగా వెళ్లిపోయిన మ‌హేష్‌కు నివాళుల‌ర్పిస్తూ రాసిన జ్ఞాప‌కం ఇది. మనుషుల్లోని కవిత్వాన్ని ప్రేమించిన మహేష్‍ అతడికి కవిత్వం ఇష్టం. కవిత్వం కంటే కూడా మనుషుల్లో ఉండే కవిత్వం ఇష్టం. అతడు తన గురించి మర్చిపోయి మనుషుల్ని ప్రేమించాడు. సొంత జీవితం గురించి మర్చిపోయి జీవితాన్ని ప్రేమించాడు. రాజమండ్రి గోదావరి తీరం అతడి అర్తికి తగిన జీవితాన్నిచ్చింది. కాళ్లు తడవ కుండా సముద్రాల్ని దాటిన మేధావి కూడా కళ్లు తడవ కుండా జీవితాన్ని దాటలేడు రాజమిండ్రిలో పేపర్‍మిల్లులో పనిచేసే చక్రాల వెంటక సుబ్బు మహేశ్వర్‍కి వాళ్ల సోదరి ఉత్తరాలు రాసేది. ఓ ఉత్తరంలో ఇది రాసిన కవి పేరుతో సహా ఉంది. అలా నా పేరు మహేష్‍కి పరిచయం. కానీ నన్నెప్పుడూ చూడలేదు. మహేష్‍అనేవాడొకడున్నాడని అతడు తర్వాత కాలంలో నాకు సోదరుడు కాగలడని నాకు కూడా తెలియదు. ఓ సారి మా అన్నయ్య శ్రీ వక్కలంక వెంకట ప్రకాశరావుగారి కోసం పేపర్‍మిల్లుకి వెళ్లాను. ఆయన నన్ను మహేష్‍దగ్గరికి తీసుకెళ్లి వీడు మా తమ్ముడు. ఏవో కవితలు గట్రా రాస్తుంటాడు అని పరిచయం చేశాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు కావచ్చు. మహేష్‍చాలా స్టె••ల్‌గా ..సేఫ్టీ ఆఫీసర్‍దర్పం ఒలకబోస్తూ ‘‘ ఏం పేరు’’అన్నాడు. ‘‘వసీరా’’ అన్నాను. ఒక్కసారిగా నమ్మలేనట్టు చూశాడు. ఆ తర్వాత ‘‘అహ్హహ్హ హ్హహ్హ హ్హా’’ అంటూ మనస్ఫూర్తిగా నవ్వేశాడు. వసీరా అంటే ఎవడో వృద్ధుడు అనుకున్నాను. ఇంత గుంటడవి అంత వేదాంతం ఎలా రాశావు. అని మరోసారి నవ్వేడు. అది నాకూ మహేష్‍కి మొదటి పరిచయం. తర్వాత మరో రెండేళ్లకి నేను మెడిక••ల్‌ రిప్రజెంటేటివ్‍గా రాజమండ్రి వచ్చాను. మహేష్‍ద్వారా సుబ్బు , ఎరాప్రగడ దంపతులు, భద్రుడు సావిత్రిగారూ ఇలా సాహితీ వేదికలో అందరూ స్నేహితులయ్యారు. వీళ్ల ద్వారా నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. నిజం చెప్పాలంటే మహేష్‍, భద్రుడూ ,గోపీచంద్‍వీరి ముగ్గురికీ సాహిత్యం పట్ల జీవితం పట్లా ఒక విధమైన మెచ్యూరిటీ ఉండేది. ప్లూరాలిటీని గౌరవించి కలుపుకునే మంచి సంస్కారం వీళ్లకి అంత చిన్న వయసులోనే ఎలా సాధ్యమో నాకు అర్థమయ్యేది కాదు. నిజం చెప్పాలంటే నాకు అప్పుడు అంత మంచి సంస్కారం లేదు. సాహితీ వేదికలో రకరకాల భావజాలం గల కవులు కథకులు విమర్శకులు ఉండేవారు. నాకు గుర్తున్నంత వరకూ నేనూ సావిత్రిగారూ మార్క్సిస్టు భావజాలం గల వాళ్లం. సాహితీ వేదికలో మార్కిస్టు భావజాలంతో రాసిన కవిత్వమైనా మరే కవిత్వమైనా అందులో కవిత్వం ఉందా లేదా అనేది ముఖ్యం. అలంకారాలు కాదు. వేదన, మానవీయ స్పర్శ, జీవితం ఇవి ముఖ్యం. నినాద ప్రాయంగా రాస్తే అస్సలు ఒప్పుకునే వారు కాదు. చీల్చి చెండాడే వారు. . పొయెట్రీలో ఏ మాత్రం తడి ఉన్నా ఇక ఆ కవితల్ని నెత్తిన పెట్టుకుని మరీ పలవరిస్తూ ఉండేవారు. సాహితీ వేదిక కవితా సంకలనానికి ‘ఆర్కెస్టా•’ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఇదే. భిన్నస్వరాల ఏకత్వంలోని సింఫనీయే సాహితీ వేదిక అని చెప్పడమే. మహేష్‍ది అశాంతీ వేదనా పలికే తాత్విక స్వరం .. అతడి లైఫ్‍స్టె••ల్‌ ....కూడా అలాగే అశాంతిమయంగా అరాచమైన అన్వేషణాభరితంగా ఉండేది. సైద్ధాంతిక గ్రంధాలు సామూహిక జీవితాన్ని అర్థం చేసుకునే సాధనాలు మాత్రమేనని, జీవితం ఈ సాధనాలకంటే బలమయినదని మహేష్‍నమ్మేవాడు. వేదనా భరితమైన అశాంతి దానినుండి ఏదో తెలియని అన్వేషణా అతడి లోలోపల ఎప్పుడూ అట్టుడుకుతూ ఉండేది. అందుకే అతడి ఫేవరెట్స్ డాస్టోవిస్కీ, బైరాగి, అజంతా, కాఫ్కా, బసవరాజు అప్పారావు. కవికొండల వెంకటరావు.. వేస్ట్ ల్యాండ్‍ఇలియట్‍...జెన్‌హైకూ కవుల్లో ఇస్సా...తిట్లూ తన్నులూ తినే పిల్లాణి చూసి కూడా అతడు అసూయ పడతాడు. అనాథ అనే హైకూని మహేష్‌తరచూ చెప్పేవాడు.. ఇలా వేదనా భరితమైన జీవితవాస్తవాలు చెప్పే కవులెప్పుడూ అతడిని వేధిస్తూ... తడిగా ఉంచేవారు. మల్లయ్యపేటలోని తన బ్రహ్మచారి క్వార్టర్స్‌లో జపనీస్‌హైకూల పుస్తకాలు ఉండేవి. వాటిని సగర్వంగా ప్రదర్శించేవాడు. చదివి విన్పించేవాడు. రాలిన పువ్వు తిరిగి కొమ్మని చేరింది సీతాకోక చిలుక. బహుశ ఈ వాతావరణమేనేమో. నేను నంది వర్థనం చెట్టు వంటి కవితలు రాయడానికి దారితీసింది. ఆ కాలంలో బహుశా మా మిత్ర బృందంలో ఇంకెవరి దగ్గరా అంతగా కన్పించని ఇంకో టాలెంట్‍ కేవలం అతడికి మాత్రమే ఉంది. అదేమంటే ఇటువంటి అశాంతిని వ్యక్తం చెయ్యలేక లోలోన కుతకుత లాడే తన లాంటి వాళ్లని గుర్తించడం. వారి పట్ల కంపాషియన్‍. సహానుభూతి. పరాయీకరణ, ప్రేమరాహిత్యం, మానవ సంబంధాల డొల్లతనం నుండి వచ్చే ఈ అశాంతి గురించి సిద్ధాంతాలు వల్లించే వారిలోనూ , కవిత్వాలు రాసే వారిలోనూ కూడా ఈ విధమైన కంపాషియన్‍చాలా అరుదు. నేను మానవ సంబంధాల కంటే కూడా కవిత్వం చాలా గొప్పదనే భ్రమలో ఉండేవాడిని. మానవ సంబంధాల దగ్గరకొచ్చే సరికి మహేష్‍ కవిత్వం కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ప్రేమరాహిత్యం, మానవ సంబంధాల్లో మానవత్వం లేకపోవడం అతడిని ఎంతగానో బాధించేవి. అందుకే అతడు ఎవరి భావజాలాలు ఎటువంటివి?. ఎవరి అభిప్రాయాలు ఎటువంటివి? అనే ప్రశ్నే లేకుండా అందర్నీ అన్‍కండిషన••ల్‌గా మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు. కుప్పలి పద్మ, శకుంతల ,సావిత్రిగారు. తమ్ముడు, మరియు తమ్మడి తమ్ముడు, ఎర్రాప్రగడ ఇలా ఒకరిద్దరని కాదు స్నేహితులందరి సమస్యల్లో కష్టాల్లో పాలుపంచుకునేవాడు. అలాగే అతగాడికి వయో బేధం కూడా లేదు. పెద్దలతో పిల్లతో కలగలిసిపోయే వాడు. గంధం సీతారామాంజనేయులు గారు అతడిని కొడుకుగా భావించేవారు. శరభేశ్వర శర్మగారు కూడా అతడిని ఎంతగానో ఇష్టపడేవారు. 1984లో మా నాన్నగారు పోయినప్పుడు నా గురించి తెగవర్రీ అయినవాడు మహేష్‍. వసీరాది ససిపిల్లాడి మస్తత్వం వాడి గుండె పగిలిపోయి ఉంటుంది. ఎలా తట్టుకున్నాడో ఏంటో అనుకుంటూ సుబ్రహ్మణ్యంనీ, ఎర్రాప్రగడనీ కూడా బయలు దేరదీసి అమలాపురం వచ్చాడు. నేను ఓ చిన్నపిల్లాడితో ఆడుకుంటూ ఉండటం చూసి వీడు నిజంగా పసివాడే అని కంటనీరు పెట్టుకున్నాడు. అవునురా ‘‘నువ్వు దుఃఖాన్ని గడగడా తాగి భగభగా నవ్వగలవు’’. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటూ వెళ్లిపోయాడు. ఇదంతా ఎందుకంటే అతడికి కవిత్వం ఇష్టం. కవిత్వం కంటే కూడా మనుషులు చాలా చాలా ఎక్కువ ఇష్టం అని చెప్పడానికే. మహేష్‍రంగస్థల నటుడు కూడా. రామనాధంగారి నాటకాల్లోనూ ,కొప్పర్తి అమరలింగేశ్వర రావుగారి నాటకాల్లోనూ కూడా అతడు నటించేవాడు. ఎన్‍.ఆర్‍నంది రాసిన మరోమహోంజదారోలోనూ మహేష్‍నటించినట్లు గుర్తు. భద్రుడు రాసిన స్వాతంత్యోద్యమ శంఖారావం నాటకంలో అతడు రాసిన పాటలు నాకు కంఠతా వచ్చేవి. ఎందుకంటే ఆ నాటకంలో నేను గాంధీ వేషధారిని. దండికడలి తీరంలో స్వేచ్చోదయం అవుతోంది..తెల్లవాడి పాలన ఇక అస్తమించబోతోంది అంటూ రవి అస్తమించని బ్రిటిష్‍సామ్రాజ్యం ఏ స్వేచ్చోదయంతో అస్తమిస్తోందో చాలా సింపు••ల్‌గా తేట పదాలతో అద్భుతంగా రాశాడు. ‘‘సామ్రాజ్యవాది మందు గుండు ఉప్పు ముందు చిత్తురా. స్వేచ్చమీద ఇచ్చనేడు ఉప్పు రూపు దాల్చెరా అని రాశాడు. నన్నయ భారత రచన నాటకం కోసం అతడు ఎంతో రీసెర్చి చేశాడు. పూజ్యులు శ్రీమల్లంపల్లి శరభేశ్వర శర్మగారి దగ్గరికి రోజూ వెళ్లి నన్నయ సారస్వత రహస్యాలను గురించి చర్చించేవాడు. అంతటి హోవంర్క్ చేసే అధ్యయన శీలి మషేష్‍. ఈ నాటకం ముగింపులో పాట నిజానికి నాటకానికే హైలైట్‍. గోదారి తీరాన నన్నయ నుండి మొదలైన తెలుగు కవితా ప్రవాహం ఎన్ని రకాలుగా పరిమాణం చెంది, ఎన్నిముఖాలుగా వికసించిందీ ఆ పాటలో రాశాడు. తెలుగు కవిత్వం పరిణామం చెందుతూ ఈ నాటకం రాసేనాటికి చెరబండరాజు విప్లవ కవిత్వ దశకు వచ్చిందని , ఆఖరి చరణంలో చెరబండరాజుకు లా••ల్‌ సలామ్‍చెప్తూ పాటముగించాడు. నన్నయ నాటకాన్ని చెరబండ రాజుతో ముగించడం బహుశ టి.జె.రామనాధం గారికీ ...మహేష్‍కే చెల్లు. మిత్రమా మహేష్‍నువ్వు రాజమండ్రిలో ఉన్నా, సూళ్లూరుపేటలో ఉన్నా ...ఇంకోలోకంలో ఉన్నా ...నువ్వెక్కడున్నా సుఖశాంతులతో ఉండాలని పరమ శాంతి స్వరూపుడు శాంతిదాత అయిన భగవంతుని ప్రార్థిస్తాను. వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUsSbA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి