శ్రీ శ్రీ ఒక ప్రయోగం,ఒక మలుపు,ఒక యోధా,మేధాక్షరం.అయన 'ప్రజ' నేలవిడిచి సాము చేయదు. సమాజాన్ని విడనాడదు. పద్యంలో 'ప్రాసక్రీడ' లా, గద్యంలో వాక్బాణం 'ప్రజ' అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇవి హాస్యం, ప్రయోజనాల మేలు కలయిక. విజ్ఞాన వికాసాల మేళవింపు. సమాచారం, విశ్లేషణల సహజరూపం. మహాకవి శ్రీశ్రీ విశ్వరూపం 'ప్రజ'. ఇంతకూ ప్రజ అంటే ప్రశ్న జవాబులు .శ్రీశ్రీ సాహిత్యసర్వస్వం - 19, విరసం ప్రచురణ : డిసెంబర్ 1990.ఆ గ్రంధం లోంచి కొన్ని .................... 1.మీకు నచ్చిన కవి ఎవరు? * జపాన్ చక్రవర్తి . ఈయనఏడాదికో పద్యం రాస్తాడు .( జపాన్ చక్రవర్తి షోవా రాజవంశానికి చెందిన హిరోహిత ( 1901-89). రాజ్యాదినేతగా1926నుంచి చనిపోయేవరకు కొనసాగాడు .మంచి మెరైన్ బయలజిస్టు.గొప్పకవి). 2.మీరు రష్యాని ఎక్కువగా పొగడుతారు. ఎందుకు? * నాది భట్రాజు పొగడ్త కాదు. యాభై ఏళ్లకిందట ఇప్పుడు మన దేశంలో లాగే రష్యాలో దరిద్రం,అజ్ఞానం ,అనారోగ్యం తాండవిస్తూఉండేవి. ఈ స్వల్ప కాలంలో ప్రప్రంచం లోని అగ్రరాజ్యాలలో ఒకటిగా రష్యాదేశం మారింది. ఇందుకు కారణమేమిటో మిరే ఆలోచించుకోండి.ఇది మెచ్చుకోదగిన విషయం అవునో, కాదో మేరె తేల్చుకొండి. 3.మీరు దేవుణ్ణి నమ్ముతారా? * మానవుణ్ణి నమ్ముతాను. 4.రచయిత మానవ బలహీనతల్ని చిత్రించగలడు. కానీ అవే బలహీనతల్ని తనే ఎందుకు ప్రదర్శిస్తుంటాడు ? * రచయితకూడా మానవుడే కాబట్టి. 5.కవిత్వానికి ఏది గీటురాయి ? * జ్ఞాపకం వుండేది కవిత్వం. మరచిపోయేది కవిత్వం కాదు.ఈ అభిప్రాయం చెళ్ళపిళ్ళ వరూ అన్నారు. అంతకుముందు అల్లసాని పెద్దన కూడా "రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ " అని అన్నాడు. 6. యువరచయితలకు ప్రాచీనసాహిత్య అధ్యయనం అవసరమా ? * పాట కవిత్వం ఎందుకు చదవాలంటే అది ఇపుడు ఎందుకు వ్రాయ కూడదో (why not to write) తెలుసుకోవడానికి . 7.జనసామాన్యాన్ని కవిత్వంతో మార్చవచ్చునంటారా ? * ఇది కొంచెం గడ్డుప్రశ్నే . జన సామాన్యానికి ఇది ఎంత చేరువలో వుంటుంది అన్నదానిపై ఆధారపడివుంటుంది.మనకి ముప్పూటలు కాదు. రెండు పూటలు కూడా తిండి దొరకడం లేదు. జనసామాన్యం కవిత్వాన్ని భోగ ద్రవ్యం గానే చూస్తున్నర. మినిమం అవసరాలు తీరాకనే కవిత్వం . మయకోవస్కి కవిత్వాన్ని ఇరవై ఏళ్ళ కిందటికన్నా ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఆస్వాదిస్తున్నారు .ప్రజలలో కవిత్వాభిరుచి ని పోషించుకుంటూ రావాలి. 8. ఈనాడు సాహిత్యానికి రాజకీయాలకి వున్నదూరమెంత ? * ఇదివరకు మైళ్ళలెక్కన వుండేది. ఇప్పుడు సెంటిమీటర్లలో కొచ్చింది.రాజకీయ దృక్పధం సరిగా లేనివాడు సాహిత్యంలో రాణించలేని స్థితి వచ్చింది. 9. మహాకావ్యం ఎప్పుడొస్తుంది ? * అసాధ్యాన్ని సాధించడానికి మార్గాలు అన్వేషిస్తున్నప్పుడు కళాశీలి అనుభవించే అశాంతి లోనే మహాకావ్యం ఆవిర్భవిస్తుంది. 10. మీ కవిత్వానికి marxism కు సంభందం ఏమిటి ? * " మహాప్రస్థానం " అన్న గీతం రాసేనాటికి నాకు marxism ను గూర్చి తెలియనే తెలియదు. నేను marxism ను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే గని రాజకీయాల ద్వారా కాదు. 5-3-2014.
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mRqs
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mRqs
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి