//ఈ కవిని చూశారా ..విన్నారా..// దాసరాజు రామారావు "అసమానతలపై అక్షరాల పంజా ఎత్తి అజ్నానంపై అక్షరదాడి చేయడానికి చైతన్యం పంపుతున్న ఆత్మీయతాక్షరాలై చదువురానోల్లను అల్లుకుంట చదివేటొల్ల సారమై జవాబిస్త ఉదయం లేచింది మొదలు ఊపిరులున్నంత వరకు అక్షరాలే జీవితం " గా కొనసాగుతున్న కవి సిద్దెంకి యాదగిరి తన " బతుకు పాఠం " కవితా సంకలనంతో సాహిత్య సమాజంలో స్థిర పడటానికి వస్తున్నాడు . ప్రముఖ తెలంగాణ కవి 'నందిని సిధారెడ్డి 'ఈ కవిని ఇట్లా నిర్వచించిండు. " అన్ని చలనాల చైతన్యం పొదవుకున్న కవి సిద్దెంకి యాదగిరి. రాబోయే కాలంలో మరింత బాధ్యతగా , మరింత శక్తివంతంగా అక్షరాలు సంధించగలడని సంపూర్ణ విశ్వాసం కలిగిస్తున్నడు.మానవ వనంలో అలజడి దర్శించడం తెలుసు. ఒత్తిడిని తట్టూకుని,అవమానాల్ని గెలవగల స్థిర సంకల్పం తెలుసు. రాలిన తారల కాంతితో,వేల ఇంధ్రధనుస్సులు వెలిగించే ఉద్యమం గుర్తు.అక్షర కణాల్ని పిడికిట్లో బంధించి భూమ్మీద వెదజల్లే కవిత్వం గుర్తు. సిద్దెంకి యాదగిరి కవిత్వాన్ని అభినందిస్తున్నాను. అక్షరంతో ఉద్యమంలో నిరంతరం వికసించాలని ఆశిస్తున్నాను". మరో ప్రముఖ తెలంగాణ ఉద్యమ (ఉస్మానియ ఉనివర్సిటి) గాయకుడు 'దరువు ఎల్లన్న' ఈ కవిని గురించి " యాదన్న కవిత్వం శ్రమ కవిత్వం.బతుకు కవిత్వం. అందుకే బతుకు పాఠంగా ముందుకు తెచ్చినడు . మనస్పూర్తిగా ఆహ్వానిద్దాం. సాహిత్య ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న నవతరం తెలంగాణ కవుల్లో నావికుడు కావాలని సిద్దెంకి యాదగిరన్న మరిత బాధ్యతతో ముందుకు సాగాలని ఎదనిండా కోరుకుంటున్న". ఊపే విసనకర్ర ..నిద్రకు మెత్త బతుకు తీరు అంతా మా అవ్వకొంగుతోనే రెపరెపలాడుతున్న జండాను చూసినా కండ్ల నిండ మా అవ్వకొంగే కనబడ్తది ( మా అవ్వకొంగు) సిద్దెంకి యాదగిరి " బతుకు పాఠం" లోకి తొంగి చూద్దామా..... 22-6-2014.
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UvIqFO
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UvIqFO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి