పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మార్చి 2014, శుక్రవారం

దాసరాజు రామారావు కవిత

శ్రీ శ్రీ -" ప్రజ "- గ్రంధం నుండి మరికొన్ని ..... ----------------------------------------- 11. మీరు నిర్దేశించిన మరో ప్రప్రంచం స్వరూపం ఏమిటి ? * నిర్దేశించలేదు. ఇమజిన్ చేశాను. అప్పటికింకా నాకు రష్యావిప్లవం కూడా తెలిదు.సాహిత్యకారుల్లోంచి-ఫర్ ఇన్ స్టేన్స్ (గురజాడ గేయాలు, ఫ్రెంచి సింబలిస్టులు , ఫ్రెడరిక్ డెలిస్( వీళ్ళు కొంచెం ముందుకు పోయి చూశారు). అలాగే కవిత్వం ద్వారా నేను మరోప్రపంచం చూశాను. అదే సామ్యవాద ప్రపంచమని అప్పటికి తెలీదు.ఒక విధమైన సాంఘీకన్యాయమ్ లభించాలని, అన్యాయం ,అధర్మం,పోవాలని కోరుకున్నాను. ఈనాడు అదే మరింత స్పష్టంగా రష్యా, చైనా, క్యూబా దేశాల్లో కనిపిస్తోంది. నేను భావించిన మరో ప్రపంచం అదే. 12.మీలోని "నేను" గురించి (కవిత్వంలో) సాధ్యమైనంత వివరంగా చెప్పండి.? * చాలావరకు నా దృక్పధం నుంచే రాశాను. సబ్జెక్టివ్ పోయెట్రియే ఎక్కువ.ఆబ్జెక్టివ్గా రాసిన 'వెర్రివాడా కుర్రవాడా' , 'బిక్షువర్శీయసి ''లాంటివి తప్ప. ' నేను సైతం' కూడా సబ్జెక్టివ్ గా రాసినదే. 13. మీరు ఎన్నడూ మరిచిపోలేని , మీ మీద శాశ్వత ప్రభావం కలిగించిన గ్రంధాలేవి ? * ఒకటి యూలిసిస్( జేమ్స్ జాయిస్ రచన ), ఇంకొకటి లెనిన్ ( మయకొవస్కీ రచన ), మరొకటి కూడా చెప్పాలంటే గురజాడ వారి సమస్త సాహిత్యం. 14. కళ ప్రజల కోసమా ? విప్లవం కోసమా ? * ఈ రెంటికి వైరుద్యం లేదు. విప్లవ సాధనకు కళఒక ఆయుధంగా ఉపయోగపడాలి . అప్పుడే అది ప్రజాకళ అవుతుంది. కళాకారుడు విప్లవసాధన కోసం జరిగే మహోద్యమానికి తన కళను అంకితం చెయ్యాలి . అందుకోసమే దానిని వినియోగించాలి. అప్పుడే అది నిజమైన కళ అవుతుంది. 15.మీ రచనల్లో ఉత్తమంగా భావించే కవిత ఒకటి చెప్తారా ? * " కవితా ఓ కవితా! " కి ప్రథమస్థానం ఇస్తాను. అంటే మిగిలినవి నచ్చవని కాదు.జగన్నాథరథచక్రాలు, దేశచరిత్రలు ఇట్లా నాకు నచ్చినవి ఉన్నాయి. 16. మీరోసారి ధ్వనికవిత్వం కమ్యూనిజంలోనే సాధ్యం అన్నారు. వివరిస్తారా? * ధ్వని - కమ్యూనిజాన్ని ధ్వనిస్తేనే ధ్వనికవిత్వం అన్నాను. ఆనంద వర్దనాచార్యులేమన్నారంటే -వ్యంగ్యార్థం ఓటివుందనీ , కవి చెప్పిన దానికంటే గూడా అందులోంచి మనకి అవగాహన అయేటటు వంటిదే ధ్వని అంటారు.' రీతి ఆత్మస్యకావ్యం' అని ఒకడన్నాడు. ఇట్లాగ - ఔచిత్యం ముఖ్యమని క్షేమేంద్రుడు (11 వ శతాబ్దం -అభినవగుప్తుని శిష్య్డుడు.అలంకారికుడు ) రసచర్చ చేయడంలో ఎందఱో సంస్కృత అలంకారికులు చెప్పారు. వీటన్నిటిలోకి ధ్వనిమతం గొప్పది అంటారు. ధ్వని ఆంటే కవి చెప్పిన డానికంటే కూడా పాఠకుడు పీల్చుకునెదే గొప్పకవిత్వం.ధ్వని ప్రధానమైనదే కావ్యం అన్నారు. అలాగే మన రచనల్లో కమ్యునిజం ధ్వనిస్తేనే అది ధ్వని అని నేనన్నాను. 17.మీకు కవిత్వం రాయాలనే కోరిక ఎప్పుడు పుట్టింది? ఎందుకు పుట్టింది? * నాకు అక్షరాభ్యాసం జరగక ముందే మూడునాలుగేళ్ళ వయసులో చిత్రకారుడిగా నా ఆర్టిస్టిక్ జీవితం ప్రారంభమైంది .ఒక కుడ్య చిత్రకారుడిగా (mural painter) రంగు సుద్దలతో మా మేడ మీద గోడలనిండా బొమ్మలు గీసేవాణ్ణి. నాలో కళపై అభిరుచి ఆవిధంగా ప్రారంభమైంది. 18.1928 లో ' ప్రభవ' రాసేనాటి మీ మానసిక స్థితి ఏమిటి ? * నా 18 ఏట నేను ' ప్రభవ ' రాశాను. ఆ రోజులలో నాకు నా చుట్టూఒక సమాజముందన్నస్పృహ కూడా లేదు.నేను, నా బూర్జువా sorroundings మాత్రమే నాకు కనిపించాయి.అయినా మానసికంగా art for art's sake (కళ కోసమే కళ) వ్యక్తిని. అప్పటికి మాకు ఆస్తిపాస్తులుండేవి. భాధ్యతలెవీ ఉండేవి కావు. అందుకే సమాజాన్ని పట్టించుకునే అవసరం లేకపోయింది. 19. ' మహాప్రస్థానం ' మొదలైన అప్పటి మీ గీతాలకు నేపధ్యం గురించి , అంటే ఈ రకమైన స్పృహ మీలో కలగడానికి కారణమైన పరిస్థితుల గురించి వివరిస్తారా? * నేను 1928 లో కాలేజి చదువులకోసం విశాఖపట్నం నుండి మద్రాసు వెళ్ళాను. మా ఆర్థిక పరిస్థితులు దిగజారడం కూడాఅప్పటినుండీనే ప్రారంభమైంది. ప్రపంచమంతటా ఆకలిదప్పుల హాహా కారాలు వినిపిస్తున్నాయి . 1930 దశాభ్దాన్ని ఆకటి దశాబ్ధం (hungry thirties ) అంటారు. ఈ అన్నిటి ప్రభావ పలితంగానే ' మహాప్రస్తాన ' గేయాలు వచ్చాయి.అంటే , కుటుంబ ఆర్థిక పరిస్థితి, హంగ్రీ థర్టీస్ , నాకు అప్పుడు చదువుకోవడానికి లభ్యమైన సాహిత్యం , నిరుద్యోగ పట్టభద్రుడిగా వున్న చోట ఉండకుండా తిరిగిన తిరుగుడు నాలో సామాజిక స్పృహ కలిగించాయి. 20. యువకవులు, రచయితలకు మీ సందేశం ? * రచన అనేది ఒక కరదీపిక. అది ఎప్పుడూ వెలుగుతూ ఉండేటట్లు చూడాలి . దాని కాంతిని అది నలువైపులకు ప్రసరిస్తూ ఉండాలి. 14- 03 2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFszvN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి