Si Ra// ఫోన్ కాల్ // 18-6-14 ఎలా ఉన్నావ్? నేనా, నాకేం, బాగనే ఉన్నా. నన్ను గుర్తుపట్టవ్ అనుకున్నా మన ఇద్దరి మధ్యలో ఎన్నో దూరాలు వొచ్చి అగాధాల విత్తనాలు నాటాయి గా. అది కాదు కానీ, ఈ మధ్య వర్షాలు కురవట్లేదు ఏంటి? కొంచమన్నా తడిస్తే బాధలు కరిగిపోతాయని ఆకాషాన్ని చూస్తూ రోజులు రోజులు గడిపేస్తున్నా. అవును పక్షులన్నీ ఎక్కడికి వెల్లిపోయాయ్, మనల్నందరినీ నిర్మానుషంలో వదిలిపెట్టి, నీకేమన్న చెప్పాయా? మర్చిపొయా, నిశబ్ధం నన్ను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు ఈ మధ్య, ఆలోచనలు నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉన్నాయ్, అదేంటో, ఎక్కడో నా గదిలోనేను కూర్చొని ఉన్నా, సముద్రపు ఘోష వినిపిస్తోంది. చాలా భారంగా కదులుతోంది సమయం ఇంటి వెనకాల నాటిన పూలచెట్టు, తన పూలనన్నిటినీ రాల్చేసి ఇంక నాకు ఈ లోకంతో సంబంధం లేదు, ఇంక ఏ పువ్వునీ నా పై మొలచనివ్వనూ అని, మొండి చేస్తోంది. అయినా నాకు ఏదో ఒకటి ఎప్పుడూ ఉంటుంది లే నువ్వు ఫోన్ చేసిన సమయంలో కుడా, ఈ బాధల గురించి ఎందుకు, వేరే విషయాల గురించి మాట్లడదాం. అవునూ, ఈ మధ్య బాగ కలలు కంటున్నావ్ అంట గా నువ్వు, కిటికీ పక్కన కూర్చొని కవిత్వం రాస్తున్నావ్ అంట, ఇంకా, సాయంత్రాలు ఒంటరిగా సూర్యుడు అస్థమించే చోటుకు నడుచుకుంటూ వెల్లిపోతున్నావ్ అంట, బాగా నవ్వుతున్నావ్ అంట, అప్పుడప్పుడు తెలియకుండానే ఏడుస్తున్నావ్ అంట, నీలోనువ్వే మాట్లాడుకుంటూ ఉంటావ్ అంట, వర్షాకాలంలో, రాత్రులు ఒంటరిగా కూర్చొని వర్షాన్ని వింటూ ఉంటావ్ అంట, నాకు అన్నీ తెలుసు నీగురించి, నీ వైపు నుండి వస్తున్న గాలులు, నీ గురించి రహస్యాలు నాకు ఎప్పుడూ చెప్తుంటాయి. సరెలే, ఇంక సెలవు, నేను వెల్లాలి నీ సమయాన్ని నేను వృధా చెయ్యలేను వాస్తవంలో కలుసుకున్నప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ST1sUX
Posted by Katta
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ST1sUX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి