కధ కంచికి//శ్రీనివాస్//18/6/2014 ---------------------------------------------------------- తిరిగొచ్చిన కధలన్నీ రచ్చబండ మీద వాలిన పావురాలకి గింజలయ్యాయి అచ్చొత్తించుకోని యెగిరొచ్చిన కధలన్నీ సభల్లో విహరించే పెద్ద గద్దలకి పిడికెడు మెతుకులయ్యాయి పాత సారా కొత్త సీసా లోకి గమ్మత్తుగా నిండిపోయింది పెద్ద బేధమేమీ లేదు వోడినా,గెలిచినా, అన్ని కధలూ యెక్కడెక్కడ శాఖా సంక్రమణం చేసినా, చివరికి చేరాల్సింది కంచికే వాల్మీకి రాస్తే గొప్పేముంది? బోయ భీమన్న రాస్తే తక్కువేముంది? అన్ని కధల్లోనూ అంతే మంచే గెలుస్తుంది చెడు చెడిపోతుంది మనిషి బ్రతుకు కధలో అదే జరిగితే వింతేముంది? అందులో కధేముంది? అందుకే నాయనా! తిరిగొచ్చిన నీ కధలను చించెయ్యకు అందులో కొన్ని ఆస్కార్ కొట్టే సినిమాలు కావచ్చు లేదా నోబుల్ కొట్టేసే సాహిత్యం కావచ్చు కనీసం మామూలు మనిషి గుండెల్లో చెమ్మనూరించే కన్నీటి చెలమ కావచ్చు!
by Maddali Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSzqEV
Posted by Katta
by Maddali Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSzqEV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి