** డా||కె.హరీష్ ||గుండె గూటి సొద || పాటంటే గుండెగూటిని సునితంగా తాకే నిశ్శబ్ద తరంగం కలల అలలన విరిసిన స్వర నిర్ఝరి మానస వీణన ఆర్ణవమైన అక్షరం పిరి విప్పి విరిసిన కాంతి పుంజం అనంతానంతరం నుంచి నేలన పడ్డ తొలకరి చినుకు మనిషి అంతరంగాన వెలసి మెరిసిన ఇంద్ర ధనుస్సు ఒక దరహాస వీచిక ఆరని ఆశ నింగిని చూపించే వెన్నుల సిరి సిరి వెన్నెల అందీఅందని జలపాతపు చిందు లయ కలమెలిగిన శృతి రేపటి లోకావలోకానికి రాచ బాట కల్లోల కడలిని మరిపించే ఘర్షణ నిండు హాలాహలాన లిప్తమాత్రపుటమృత ఝరి కారు చీకటిన వినిపించే వేదనాదం మనిషి గుండెన గలగలలాడె అగ్ని శిఖ ఆనందహేల మనిషికి ప్రకృతి ప్రసాదితమైన సుంద పరినిర్వాణం ఈ గుండె గూటి సొద ! ________________ కీ.శే.హరీష్ స్మృతి సంచిక నుండి వారి కవిత. ________________2007 సెప్టెంబర్ ** (18.6.2014)
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDzonB
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDzonB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి