చెలికత్తెలు ఒకటే తలుపులు తడుతున్నారు ఎవరూ తలుపులు తీయడమేలేదు ఆ గదిలో ఊర్మిళాదేవి నిద్రపోతూ ఉంది పై కవిత ఇటీవలే కవిజాలం అనే గ్రూపులో వచ్చింది. దీన్ని రాసింది నా మిత్రుడు ఆచార్య ఎస్జీడీ చంద్రశేఖర్. ఈ ముఖ పుస్తకం కూడలిని నిర్వహించేది కూడా చంద్రశేఖరే... పై కవిత చాలా బాగుంది. ఐదు పంక్తులున్నాయి. అంటే ఆయిదు పాదాలు ఇందులో ఎంతటి క్లుప్తి ఉందంటే ఇందులో ఇందులో ఏ అక్షరం తీసివేసినా కవిత చెడి పోతుంది. వ్యాకర్తలు సూత్రాలు రాసేటప్పుడు ఇలాంటి క్లుప్తత అవసరం. మన తెలుగు కవులు చాలామంది ఇలాంటి క్లుప్తత సాధించడం దగ్గరే విఫలం అవుతారు. కారణం కవితని రాసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోరు. అదేదో భవ్యకవితావేశంలో వచ్చింది. దీన్ని మార్చి చాలా మంది ఇలా చిన్న చిన్న కవితలు రాస్తున్నారు. ఇంత జిగిని వారు సాధించలేకపోతున్నారు. ఇక పై కవితలోని విషయానికి వస్తే ఇక్కడ కవి చాలా లోతైన భావాన్ని దాచాడు. ఊర్మిళా దేవిని ప్రస్తావించి పురాణ వాతావరణాన్ని సంపూర్ణంగా తెచ్చాడు. ఈ ఒక్క పేరు ఒక పెద్ద చిత్రాన్ని ఒక పెద్ద ఘటనని పాఠకువని మనస్సులో తెచ్చి పెడుతుంది. కాని ఇక్కడ కవి ఉద్దేశించేది ఊర్మిళా దేవిని గురించి రాయాలని కాదు రామాయణం గురించి చెప్పాలని కాదు. ఒక సుప్త చేతనావస్థలో ఉన్న వ్యక్తిని గురించి. సుప్త చేతనావస్థలోని భావాన్ని గురించి. ఇక్కడ ఈ కవితని దేనికైనా అన్వయించి అ్థం చెప్పవచ్చు. వ్యక్తులు, సంస్థలు, దేశాలు, సంస్కృతులు, నిద్రావస్థలో, సుప్త చేతనా వ్యవస్థలో ఉండవచ్చు. పాఠకుడి మనస్సు తనకు దగ్గరగా అనుభవంలో ఉన్న ఇటువంటి విషయంపైకి మళ్ళుతుంది. కవితలోతైన విషయం దగ్గరికి లాక్కుపోతుంది. దీనికున్న శక్తి ఇది. ఊర్మిళాదేవి నిద్ర అనే చాలా ప్రసిద్ధమైన జానపదగేయం ఉంది. జానపద సంస్కృతిలో కూడా ఊర్మిళాదేవి చాలా పాపులర్. ఆధునిక కవితలో పురాణ ప్రతీకల్ని వాతావరణాన్ని కల్పించి దాని ద్వారా ఆధునిక జీవితాన్ని వ్యాఖ్యానించడం మనకు చాలా కాలం నుండే ఉంది. దీన్ని చంద్రశేఖర్ అతి క్లుప్త స్థితిలో చంద్రశేఖర్ సాధించారు. మంచి కవిత యువకవులకు స్పూర్తి నిచ్చే నిర్మాణం ఉంది. అభినందనలు. పులికొండ సుబ్బాచారి.
by Pulikonda Subbachary A Poet
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndxaVc
Posted by Katta
by Pulikonda Subbachary A Poet
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndxaVc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి