గీతలూ, చిత్రాలూ ----------------------------- నా పాదాల కింద పువ్వులు లేవు పది ఉన్నవన్నీ ముళ్ళే అయినా రక్తం తుడిచేసుకుని నడచి వచ్చాను నన్ను తాకుతూ వెళ్ళింది దక్షిణాన స్నానం చేసి వచ్చిన గాలి కాదు ఊపిరితిత్తులను కార్బన్ కాగితాలుగా మార్చేసే భాస్వరపు గాలి అయినా వేడి వేడిగా నేను శ్వాసించాను ఏడాది పొడవునా ఉండిన అగ్ని నక్షత్రంలో మండిన నా గొడుగు అయినా నా నీడ నీడలోనే బహుదూరం వొదుగుతూ వచ్చాను నా తలపై డేగలు ఎగురుతూనే ఉన్నప్పటికీ నేను ఇంకా చనిపోలేదు అని అనునిత్యం నిరూపించికోవలసి వస్తోంది నా నగ్నత్వాన్ని ఒక చేత్తో కప్పుకుని నా మరో చేత్తో వస్త్రాన్ని నేసి ధరించాను ఈ రోజు నా ప్రవాహం చూసి తీరాలు భ్రమించవచ్చు కానీ ఈ నది ఎడారి ప్రాంతంలో బండల మధ్యలోనుంచి దిగి వచ్చిన ప్రవాహం తన స్వీయ కన్నీరు కారడంతో రెట్టింపైంది ఈ నది ఈ విత్తనం తనపై పడిన బండరాళ్ళను చీల్చుకుని మొలకెత్తింది ఈ రోజు గాయాలను కప్పే పువ్వులతో నేను రాజీపడటం అసాధ్యం ఈ సామాజిక ఏర్పాటు నాకు సమ్మతం కాదు చరిత్ర అనేది ఒక మనిషి పరిచయ అట్టముక్కా...? లేక అది ముగింపుని వెతికే ఒక సమాజపు చిరునామానా ? ఇదిగో గాయంతో పాడిన సంగీతం నా జ్ఞాపక చలనానికి నలిగిన నమ్మకాలకు నా కలం నుంచి రక్తదానం చేస్తున్నా... ఇందులో కొన్ని నిజాలు చెప్పలేదన్నది నిజం కానీ చెప్పినదంతా నిజం నేను గీయాలనుకున్న చిత్రమే అయితే వచ్చినవేమో గీతాలు కానీ గీతాలూ చిత్రాలే.... మానవత్వమే జీవితం అనే దాన్ని తెలుసుకున్నప్పుడు నా వీపు బరువెక్కుతోంది మరో ముప్పై ఏళ్ళుగా ---------------------------------- తమిళంలో కవి వైరముత్తు అనుసృజన - యామిజాల జగదీశ్ 14.6.2014 ---------------------------
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ll7J2D
Posted by Katta
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ll7J2D
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి