మోహన్ రుషి // ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా! // చూసే దృష్టిని బట్టి కాకుండా నిజంగానే కొన్ని మంచి రోజులుంటాయి. దూరాన ఉన్న ఒక మిత్రుడు రింగుమంటాడు. నవ్వించి ఏడ్పిస్తాడు.నిన్నటి అసంతృప్తులెంత అల్పమైనవో తెలియబరుస్తాడు. ఖాళీగా ఉన్న ఎదుటి ఫ్లాట్లో నవదంపతుల జంటొకటి ముసిముసి నవ్వుల్తో దిగుతుంది. వాళ్ళ ఆనందంలోని తునకొకటి నీ మొహాన్ని ప్రేమగా స్పృశిస్తుంది. పార్కులో ఆడుకుంటున్న పిల్లలు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ను చేస్తారు. బోణీ చెయ్యమంటూ ఆకుకూర ఆప్యాయంగా అడుగుతుంది. రోడ్డుమీదకొచ్చిన నీలో ఒక షేరింగ్ ఆటో ఒదిగి కూర్చుంటుంది. కిక్కిరిసిన బస్సులోని స్టాండిగ్ ఒవేషన్ను కిషోర్ కుమార్ సేద తీరుస్తాడు. ఒకానొక ప్రియురాలి జ్ఞాపకం. వొంకర్లు తిరిగిన తీయని మూలుగు. ఇక ఆ నిముషానికి సంతోషం సగం బలం నిజమేననిపించి. బతకాలనిపించి. రేపటి గురించిన బెంగ లేదు, లేదనిపించి. అకేలా చల్నా భీ ఎంతో హాయిగా అనిపించి. నిజంగానే కొన్ని మంచి రోజులుంటాయి. రోజువారీ జీవితాన్నేఒక పరమాద్భుతంగా దర్శింపచేస్తాయి. 14. 6. 2014
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veM0RC
Posted by Katta
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veM0RC
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి