వేములచంద్ర || నిబద్దించుకోలేక .... నన్ను నేను || మేము ఆదివాసులం ఎవరి ఆలోచనలను ఎవరి ఆనందాన్ని కాదనని అర్ధం చేసుకోవాల్సిన సమాజం వద్దనుకున్న జీవులం మేమూ మా సమూహమూ మా దారుల్ని సడల్చుకున్నాము. మీ ఇష్టం మేరా శాంతిని కోరుకుని, అయినా మీరెందుకిలా ఇంకా మమ్మల్నీ, మా గమ్యాన్ని నిర్వచిస్తున్నారు? మీ నిర్దేశానుసారమే నడిచేలా? మేము నడుస్తున్నాము. నడుస్తూనే ఉన్నాము .... తరతరాలుగా ఆది మానవుడి రోజుల్నుండీ ఎందరమో ప్రాణాలను కోల్పోయాము. మా భూముల నుంచి మమ్మల్ని వెలి వేసి, ఇంకా. వెలి వేస్తూనే ఉన్నారు. మాలో ఆవేశపరులు కొందరి ఆందోళన వారి ఆవేశాన్ని ఆశయాల్నీ మీ కాళ్ళ వద్ద పణంగా పెట్టామని ..... మీ శాంతి ప్రస్తావన విని, ఇప్పుడు వారు మమ్మల్ని జాతి ద్రోహులంటున్నారు గాయపరుస్తున్నారు. తిడుతున్నారు వెలివేస్తున్నారు మాలో ఎందరో విప్లవం బాట పడుతున్నారు. తటస్తంగా ఉన్న మమ్మల్నే అందరూ అసహ్యించుకునేది. మా పైనే అన్ని అపనిందలూ అన్నికోణాల నుంచీ నేనొక ఆదివాసిని. ఇప్పుడు .... నా రక్తం లో యుద్దమృదంగాలు నా జాతి, నా జాతి గౌరవం కోసం నేనిప్పుడు నా చేతిలో లేను. 14JUN2014
by Chandra Shekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TV2Vvl
Posted by Katta
by Chandra Shekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TV2Vvl
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి