అనుక్షణికం నిత్యం యుద్ధభూమిలోనే జీవితం ఉదయిస్తున్నది స్వప్నాంకితదృశ్యాల్ని బలిగొన్న కనురెప్పల్ని విప్పి చూపు ఉదయించగానే ఎదుట యుద్ధసంరంభమే కలలతో యుద్ధం, కళ్ళతో యుద్ధం, చూపుల్తో యుద్ధం, దృశ్యాల్తో యుద్ధం, అనుభూతితో యుద్ధమే, అనుభవాలతో యుద్ధమే, రాజీలేని నిరంతర పోరాటం, బ్రతుకు పరుచుకొన్న యుద్ధభూమి అయింది ఊపిరితో యుద్ధం, ఊహలతో యుద్ధం, ఆలోచనలతో యుద్ధం, ఆశయాలతో యుద్ధం, ఆచరణ కోసమూ యుద్ధమే, జీవితమే యుద్ధరంగమై పోయింది ప్రతిదిన పోరాటంలో నేనొక సైనికుణ్ణి ఎన్నిసార్లు అమరత్వం పొందానో, ఎన్నిసార్లు అనంతత్వాన్నై పోయానో, అనుక్షణికమైపోయింది యుద్ధం, నా బహిరంతరాల్లో నిరంతరం యుద్ధమే యుద్ధం కర్మిస్తున్నా ఫలం దక్కని బ్రతుకుతెరువుతో అనునిత్యం యుద్ధం నిజం తెలిసీ ఎదిరించలేని పిరికితనంతో యుద్ధం, నిజం చెపితే ఎదురయే సాచివేతలతో యుద్ధం, నన్ను నన్నుగా జీవించనీయని లౌక్యాలతో యుద్ధం, నన్ను దుక్కిగా దున్ని బుద్ధిచాళ్ళు తీర్చిన ప్రశ్నలతో యుద్ధం అణువణువూ యుద్ధభూమిగా మారిన నా మనశ్శరీరాల సంధ్యలో సందిగ్ధయుద్ధం జీవితం ఒక యజ్ఞం ఒక కల ఒక అల ఒక చూపు ఒక దృశ్యం ఒక కావ్యం అయితేనేం బ్రతుకు యుద్ధరంగమైనాక ( నా తొలి కవితాసంకలనం ‘మట్టిపొత్తిళ్ళు - 1991’లోంచి )
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ll7Knh
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ll7Knh
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి