నా హృదయం.... నిండా పచ్చటి ఆకులు...సన్నటి తీగలు...రంగు రంగుల పూలు రివ్వున ఎగిరే పిట్టలు ...నీలి నీలి ఆకాశం...ఏడు రంగుల ఇంధ్ర ధనుస్సు... చిటుకు చిటుకు వాన ...నేలంతా తడిసిన మట్టి వాసన...పొగడపూల చెట్టు...ఎర్రెర్రని అగ్నిపూలు...సువాసనల మొగలి పొత్తులు...గుత్తులు గుత్తులుగా సంపెంగ పువ్వులు...సాగర తీరాలు...కెరటాల సంగీతం...హోరెత్తే జలపాతం...హాయిగా సాగే సెలయేరు...ఆవరించుకుపోయే అడవులు...మహోత్తుంగ హిమాలయం...మా గోదారమ్మ...క్రిష్ణమ్మ..కావేరమ్మ..గంగమ్మ... తుంగభద్రమ్మ..నర్మదమ్మ...ఎన్నో ఇంకా ఎన్నెన్నో నా గుండె లో దాగున్నాయ్...అప్పుడప్పుడూ ఉప్పొంగుతుంటాయ్... నా ప్రియ నేస్తాలు...నా ప్రాణ సఖులు...నా ఆత్మిక నేస్తాలు...ఒకరా ఇద్దరా...అసంఖ్యాకం అపురూపం..అనితర సాధ్యం.... నా హృదయం నిండా ఇవే... నేను నా పని ...ప్రకృతి...పుస్తకాలు...నా ప్రాణ నేస్తాలు ఇంకేమీ లేవు ..ఇంకేమీ వద్దు కూడా... ఇన్నింటిని ఇముడ్చుకున్న నా హృదయ వైశాల్యం ఇంతే ఉంటుంది కదా !!!!
by సత్యవతి కొండవీటి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veM0B8
Posted by Katta
by సత్యవతి కొండవీటి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veM0B8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి