పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జూన్ 2014, శనివారం

Mukkera Sampath కవిత

//ఆమె// -ముక్కెర సంపత్ కుమార్ ప్రకృతి కాన్వాస్ మీద చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసినట్లుండే శరత్కాల చంద్రుని సుందర దృశ్యం ఆమెకు పులకరింత కలిగించదు కృష్ణపక్షపు నిశిగద్దె పై హృది జలదరించేలా తీతువు పిట్ట కర్ణకఠోర కచేరీ వినిపించినా ఆమె ఏమాత్రం వెరవదు బాహ్య ప్రపంచపు చీకటి వెలుగులు, సూర్య చంద్రులు ఆమె కెందుకు? కోటి పున్నముల వెన్నెల వెలుగులు తన పసి పాప బోసి నవ్వుల రాశుల్లోనే నిత్యం చూసుకోగలదు ఆ నలుసు ఇసుమంత బాధ పడినా తానే నిబిడాంధకారంలో బంధీయైనట్లు తల్లడిల్లుతుంది అందుకే ఆమె అమ్మ ఆ ప్రేమ అజరామరం*

by Mukkera Sampath



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qKi2CD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి