పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జూన్ 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఊరికే ....|| నాఊరిగాలి సోకగానే,పొలిమెర తాకగానే, ఎన్ని రహస్యసంభాషణలో చెట్టుతో,చెరువు గట్టుతో,కలయతిరిగిన మట్టితో ఎన్నెన్ని రహస్యసంభాషణలో పోయున మనుషుల ఙాపకాలతో... కూలిపోయున నిర్మాణాల ఆనవాళ్ళతో ఎన్నెన్ని సంభాషణలొ ఏళ్ళ క్రిందటి వూరు మళ్ళీ కళ్ళకు తగిలించబడితే........ దారిపొడవునా మాటువేసిన అప్పటి వేలవేల మాటలు ఎన్నెన్నో నాచెవిలో పూసాయి అప్పటి ఆకాశం వైపు దారితీస్తూ నాలో నేనే నడచిపోతున్నప్పుడు ..ఎన్నెన్ని మధుర సంభాషణలో చిన్ననాటి గొంతుకలు పలకరింపుల గుభాళింపులో .... మళ్ళీ బాల్యాన్ని రాసుకొని అమ్మమ్మ కాళ్ళ మురుగుల చప్పుడు మళ్ళీ విని,నేనప్పుడు పెంచిన తోకబంతి పువ్వొకటి కోసుకొని నాఎదుట నేను నిలబడ్డాను ....విధిలేక మెల్లగా మళ్ళీ ఇప్పటి లోకి జొరబడ్డాను

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdCXQV

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి