పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Chandra Shekhar Vemulapally లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chandra Shekhar Vemulapally లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2014, బుధవారం

Chandra Shekhar Vemulapally కవిత

వెములచంద్ర || భయం తో ....? || పొరపాటులే అన్నీ తొందరపాటులే మళ్ళీ మళ్ళీ సలహాలు వినీ వినీ పారిపోవాలని మళ్ళీ మళ్ళీ అబౌతికం ముక్తిపదం లోకి .... నానుంచి నేను అతి పెద్ద సంసారంలో అతి కొద్ది అవకాశం .... జీవితం మార్గాలన్నీ మూసుకుపోయి శబ్దరహిత శున్య ఆలోచనలకు దూరంగా పారిపోవాలని .... వాస్తవానికి దూరం గా ఒక కొత్త ప్రాణం మళ్ళీ పుట్టేందుకు మరణించి కొత్త దిశ గమ్యం వైపు పయనించేందుకు ఒక ఆత్మ .... మరో కొత్త నేను లా పుట్టి, ఎదిగి, పండి క్రుళ్ళిపోవాలని నుదుట రాయబడి రోగాలు రొష్టులకు భారినపడి నేరస్తుడిలా పరుగులుతీసి జీవబంధాల నుంచి విముక్తుడయ్యేందుకు ఎన్ని రాత్రిళ్ళు గడిచిపోయాయో నిశ్శబ్దం మాత్రం సమసిపోలేదు అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే గొడలులా అడ్డొస్తూ .... గమ్యం దిశలో వాస్తవికతకు ఎదురుపడలేక 19JUN2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U8j1BC

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || నిబద్దించుకోలేక .... నన్ను నేను || మేము ఆదివాసులం ఎవరి ఆలోచనలను ఎవరి ఆనందాన్ని కాదనని అర్ధం చేసుకోవాల్సిన సమాజం వద్దనుకున్న జీవులం మేమూ మా సమూహమూ మా దారుల్ని సడల్చుకున్నాము. మీ ఇష్టం మేరా శాంతిని కోరుకుని, అయినా మీరెందుకిలా ఇంకా మమ్మల్నీ, మా గమ్యాన్ని నిర్వచిస్తున్నారు? మీ నిర్దేశానుసారమే నడిచేలా? మేము నడుస్తున్నాము. నడుస్తూనే ఉన్నాము .... తరతరాలుగా ఆది మానవుడి రోజుల్నుండీ ఎందరమో ప్రాణాలను కోల్పోయాము. మా భూముల నుంచి మమ్మల్ని వెలి వేసి, ఇంకా. వెలి వేస్తూనే ఉన్నారు. మాలో ఆవేశపరులు కొందరి ఆందోళన వారి ఆవేశాన్ని ఆశయాల్నీ మీ కాళ్ళ వద్ద పణంగా పెట్టామని ..... మీ శాంతి ప్రస్తావన విని, ఇప్పుడు వారు మమ్మల్ని జాతి ద్రోహులంటున్నారు గాయపరుస్తున్నారు. తిడుతున్నారు వెలివేస్తున్నారు మాలో ఎందరో విప్లవం బాట పడుతున్నారు. తటస్తంగా ఉన్న మమ్మల్నే అందరూ అసహ్యించుకునేది. మా పైనే అన్ని అపనిందలూ అన్నికోణాల నుంచీ నేనొక ఆదివాసిని. ఇప్పుడు .... నా రక్తం లో యుద్దమృదంగాలు నా జాతి, నా జాతి గౌరవం కోసం నేనిప్పుడు నా చేతిలో లేను. 14JUN2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TV2Vvl

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || అమ్మే దైవం || ఒక మజిలీ కానిది ఏనాడూ పొరపడనిది అమ్మ ప్రేమ అన్ని అవసరాలు తీర్చడం అమ్మ లక్ష్యం, అమ్మ కల ప్రాణం పొయ్యడంతో పాటు స్వయం స్వతంత్రత ను చేకూర్చాలని, అమ్మ సంకల్పం ప్రేగు తెంచుకుని పుట్టిన చిరంజీవి జీవితం స్వర్గమయం కావాలని తన కష్టం, తన తపస్సు, తన పూజ .... సర్వం వారి కోసమే అని వారిపై ప్రేమను పెంచుకుని చూసి ఆనందించడం కోసమే అని ఆరాటపడి, ఆ మాటల్లో ఎప్పుడూ వారి రక్షణ తపనే .... ఒక జీవిత కాలం పాటు .... వారిని కళ్ళల్లో పెట్టుకుని చూడాలని తిరిగి చూడబడాలనుకోని కేవలం చూడాలనే ఎలాంటి అలజడి, ఉపద్రవం ప్రమాదం కలగకుండా చూడటం తన విధి అనుకుని పెంచి, పంచడానికే .... తనలో ఈ అనురాగం మమకారం ప్రేమ అని ఆనందం, సంరక్షణ సునిశ్చితం చెయ్యడమే విధి గా జీవితం రహదారిలో ఎదురుపడే రాళ్ళూ, ముళ్ళను ముద్దాడి అవి, వారికి ఎలాంటి హానీ తలపెట్టనివిదంగా తన స్వేదం, కష్టం, కన్నీళ్ళని చెప్పులు, బట్టలుగా అమర్చి తరగని తన ప్రేమను పంచుతూ .... అమృతమూర్తి అమ్మ అమ్మ ప్రేమ, ఒక వడలని పుష్పం, ఒక చెయ్యని వాగ్దానం! 11JUN2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ocgDHH

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Chandra Shekhar Vemulapally కవిత

ఆమె అమ్మ అమృతం బొట్లు ఆ వేళ్ళనుంచి అమృతం ధారలు ఆ రక్తనాళాల్లో పారుతూ ఆమె, అమృతమూర్తి .... రాలుతున్న ఆ కన్నీటి బొట్లు మమకారం పేగు బంధం తెగి పేగు మెలిపడిన నరకయాతన ఎద నులిమిన వ్యద మనోస్రావం .... ఆమె

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU4go

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || నీ గుడిలో .... దేవతను కావాలని || నీవు కళ్ళు మూసుకుంటే ఆ కలలో కనిపించే ముఖాన్ని కావాలని ఏ రాత్తిరైనా నీవు సేద దీరే కోరుకునే వెచ్చదనం స్పర్శను కావాలని నీ ఊహల్లో పరవశాన్ని జగదేకసుందరిని ఒక అద్భుత సౌందర్యాన్ని కావాలని కలకు వాస్తవం కు మధ్య అన్నీ నేనే అయ్యుండాలని .... నీ జీవితం లో నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని నన్నే నీవు శ్వాసిస్తుండాలని నా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ నీ ప్రతి కలలోనూ నేనే అయి నేను నిన్ను చూస్తు పరామర్శిస్తున్నట్లు నా సాన్నిహిత్యమే నీ పారవశ్యం అవుతూ ఇక్కడ, నా మనసంతా నీవై నీండిపోయిన విధంగా నీ కనుచూపును కావాలని .... కోరుకుంటున్నాను లోతుగా నీవు నీ ఆత్మలోకి చూసుకునే చూపును కావాలని నీ ప్రపంచమంతా నేనే అయినట్లు పరిపూర్ణతను నీవు నా కలయిక ద్వారా .... నీవు ఎంతగానో కోరుకునే పరవశం ఒక ఘాడమైన ముద్దును నేను కావాలని నీ ప్రతి కోరిక పరిణామం సమాధానం నీవు కోరుకునే అమరత్వం నేను కావాలని ఎవరూ ఎన్నడూ చూడని ఊహకందని అద్భుతం, ఆసక్తిని నేను అని .... నీకు అనిపించాలని నేను నిన్ను కోరుకుంటున్నంత ఘాడం గా నన్ను దూరంగా వెళ్ళనీయని భావన నీలో ప్రబలి నీ గుండె లోతుల్లో నీవు ప్రతిష్టించుకునుండాల్సిన నీ దేవతనై ఉండాలని నీ పరిసరాలు .... వీచే గాలీ, పారే నీరూ, రగిలే అగ్ని, ఆ ఆకాశం, ఈ భూమి అన్నీ నేనై నిండిపోవాలని .... నీ జీవితం లో 06MAY2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q9LKUX

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || కాలాన్ని స్తంభించనిద్దాం .... ! || నేను, ఒక పోస్ట్ చెయ్యని ప్రేమ లేఖను రాసుకున్నాను .... నిన్ననే నాకు నేను విడమర్చుకునేందుకు పదాలు దొరకలేదు బహుశ, నీవు దూరంగా ఎక్కడో ఉండటం వల్లో నా సరసన లేకపోవడం వల్లో నిన్న నేను నాకో విజ్ఞాపన పత్రం రాసుకున్నాను. చాలా కష్టం అనిపించింది. అలా జరగకుండా ఉండి ఉండాలనిపించింది. కానీ, పెంచుకున్న ప్రేమ మాత్రం అది సహజమే ..... బాధతో తగ్గదు అంటుంది ఆత్మ శోధన చేసుకున్నాను పూర్వాపరాల్ని. నిజాన్ని నేను నిన్నూ సంఘటనల్ని సరిగ్గా అర్ధం చేసుకున్నానా అని, నీ, నా సాంగత్యానుబంధం పరస్పర అనురాగాన్ని చూసి ఆశ్చర్యం వేస్తుంది. మనం కలిసుండకపోవడం అనుకున్నదేమీ లేదు కానీ దూరమయ్యాము. నేను ఈ స్థితిని భరించలేకపోతున్నాను నా గుండె, నీ కోసమే కొట్టుకుంటుంది. నీ కోసమే శ్వాసిస్తుంది. నీకోసమే పాడుతుంది. నీ భావనలే ఎప్పుడూ నొప్పిని దాయగలుగుతున్నాను. ఎద భావనల్నే దాయలేకపోతున్నాను. నిద్రలో మాట్లాడుతున్నానని తెలిసింది. నాలో నేను ఓ పిల్లా! నిన్నే ప్రార్ధిస్తున్నాను నా మాటలన్నీ నీవు వినాలనే ఆ పిదప కలలో .... నువ్వెదురుపడితే నిన్ను చూడాలని .... పిల్లా! కలలోనైనా నిజం పిల్లా! నేను ఎప్పటికీ మరువలేకపోతున్నాను నాడు ఉద్యానవనంలో మనం అతుక్కుపోయి కూర్చునున్నప్పుడు నీవు అన్న మాటలు నాతో కలిసి ఏడడుగులు నడవాలనుందని అందుకే నాలో నిన్ను మోస్తూనే ఉన్నాను ఇప్పుడు కాని ఎప్పుడైనా కానీ నీకూ అవగతం కావాలని, అవుతుందని ఆశపడుతున్నాను. ఈ ప్రేమ భావనలే నీలోనూ తప్పని స్థితి రావాలని ఓ పిల్లా! అప్పుడు మన సాహచర్యం పొదరింటి లోకి .... చూస్తావని కాలం స్తంభించే క్షణాల .... జీవ సాఫల్యతను గుర్తిస్తావని 04MAY2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ic6vW9

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || సహజం || పూలపానుపుపై నా తలలో నా ఆలోచనల్లో నన్ను నిలదీస్తూ కొంటెగా .... నవ్వులు రువ్వుతుంది నీ రూపమే నిద్దుర నాకు తోడు రానంటుంది .... ......, ఎందుకో అనిపిస్తుంది నీవు, స్థిమితంగా కూర్చుని, నా హృదయం తో .... ఆటాడుకుంటూ ఉన్నావేమో అని. ఆ ప్రభావమే నన్నిలా తపించేలా చేస్తుంది అని. తెలుసుగా చెలీ .... అది న్యాయం కాదు. కేవలం ఒక ఆటే ప్రేమ అని .... అనుకోలేను. చిలికి చిలికి జల్లు గాలివానైనట్లు ప్రేమ జూదం ఆకర్షణల పాచికల ఆటలో .... నన్నోడి అధర్మంగా నీకు దాసుడ్ని అయ్యానని. అలా ఆలోచిస్తే చాలా కష్టం గా ఉంటుంది. అయినా, నిజం గా నా ఓటమి నిన్ను సంతోషంగా ఉంచగలిగితే ఆ ఆనందం చాలదూ .... ఈ జీవన సాఫల్యానికి నేను కలలు కన్నది నిన్నే నిజం చెబుతున్నా! నీ ప్రేమ లేని అస్తిత్వం .... లేదు నాకు. నీలోనే నివశిస్తూ నిన్నే నేను కలలు కంటుంది, నేను పూజిస్తుంది, జీవిస్తుంది, నిన్ను ప్రాప్తించుకునేందుకే .... అని నీకు తెలుసు! ఒంటి స్తంభము మేడలో .... ఒంటరిగా ముస్తాబించుకుని మేనువాల్చినా ఎందుకో నిద్దుర రాదు. టేప్ రికార్డర్ లొంచి మంద్రం గా వడపోసినట్లు ఒకప్పటి ప్రేమ జంట, మనం .... చెట్టాపట్టాలేస్తూ పాడుకున్న పాటల సంగీతం వినిపిస్తూ ఆ నిన్నటి నిజం తుడిచెయ్యలేని గతం జ్ఞాపకం హృదయాన్ని స్పృశిస్తుంటే నా జీవన ప్రశాంతతను నిన్నను ..... నిన్ను, మరిచిపోలేకపోతున్నాను!? ప్రేమకు అర్ధం తెలిపి, బాష్యం చెప్పింది నీవే అన్న నిజాన్ని. జీవించడానికి .... ఒక ఆశవై, ఒక నమ్మకానివై అనిశ్చితి, అపనమ్మకం గడియల్లో .... నిర్వీర్యుడ్నైన క్షణాల్లో .... ధైర్యానివై, పురోగమించేందుకు తోడుగా నిలబడ్డ నీ కోసం కలలో ఎదురుచూడటం సహజమే కదూ! ఈ జీవనంలో, పూజ, గమ్యం నీవు కావడం! 14APR2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gvslnw

Posted by Katta

6, మార్చి 2014, గురువారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || మాతృమూర్తి || కడుపులో దాచుకుని భద్రం గా తొమ్మిది మాసాలు .... ఓ మాతృమూర్తి కన్నావు నన్ను .............. భూమ్మీద పడ్డాక కూడా నా బ్రతుకును నేను నేనుగా బ్రతకగలిగేలా అవసరమైన సమయస్పూర్తిని, విజ్ఞతను, ధైర్యాన్ని నా రక్తనాళాల్లో నింపి ............. అక్కడ, ఆ ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక జీవితాన్ని ఆవిష్కరించావు నీ ప్రేమను ఉగ్గుపాలు గా చేసి ఎంతో శ్రద్ధగా, మురిపెం గా నన్నో ధైర్యవంతుడ్నిలా దిద్దావు. .......................... నా అవసరాలు, నా ఆలోచనలు నన్ను పక్కదోవ పట్టించకుండా దిశా నిర్దేశం చేసావు .................... ఒక పరిపూర్ణ మాతృముర్తి లా శ్రమ, సహనం, స్వేదం, నమ్మకానివై నా ఎదుగుదలలో అమూల్యం .... నీ పాత్ర ................... అప్పుడప్పుడూ నీలో బాధను గమనిస్తున్నాను.. నీ పెంపకం లో లోపం ఉందేమో అని నీలో నీవు అనుకోవడమూ విన్నాను. ................... లోపరహిత జీవనం సాధ్యమా అమ్మ ఈ ప్రపంచం లో ..... పరిపూర్ణత అనేదే లేదు. ఆ దిశగా నడుస్తున్నాను. అదే చాలు!. అమ్మా! నీకోసమే ఈ కవిత రాసుకుంటున్నాను. . నీకు తెలియాలని కాదు.. నా మనసు మాటలివి. ................ నీ ప్రేమ లో పుత్ర మోహాన్ని మించిన దేవతాతత్వాన్ని చూసానని, నీ ప్రతి చర్యలో అంకితభావనను గమనించానని, ................ నీకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చూడాల్సిన బాధ్యతే ఒక వరం అని, మనసు మాటకు అక్షర రూపం ఇస్తున్నా! అంతే! ................. నీ అనురాగం, నీ మమకారం నీ రూపం నీవు కాదా కారణం? .... అమ్మా! ప్రతి స్త్రీలోనూ ..... పవిత్రతను, తాపసి నే చూడగలగడానికి .... నీ ఆశిస్సులు శ్వాసగా .....!! 06MAR2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ospJum

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || నీతో కలిసి ఎగిరిపోవాలనుంటుంది. || నీవు పక్కన ఉన్నప్పుడు ఎందుకో తెలియదు ఒక లక్ష్యం, ఆలోచన లేని దురుసు యౌవ్వనాన్నై ఉండాలనుంటుంది. రాత్రిళ్ళు స్పీడుగా డ్రైవ్ చెయ్యాలనుంటుంది. గచ్చిబౌలీ, మాదాపూర్, కావూరీహిల్స్, పంజాగుట్ట, ప్రకాష్ నగర్ .... ఫ్లై ఓవర్ల మీదుగా ఎగిరి, కారు కిటికీలు క్రిందకు దించి, మ్యూసిక్ వాల్యూం పెంచి, నీతో బుద్ద పౌర్ణిమా, నెక్లెస్ రోడ్లమీద గడపాలనుంటుంది. టాంక్ బండ్ వైపు వెళ్ళి అక్కడ, ఆ బుద్దుడ్ని చూస్తూ .... కొబ్బరి బొండాలు కొట్టించుకుని తాగుతూ .... తెల్లవార్లూ అలా, విలాస, విహార యాత్రలకని తిరిగి, ఆక్కడి వసతి గృహాల్లో అనియంత్రితం గా కాలం గడిపేయాలనుంటుంది. వస్తు ప్రదర్శన శాలల్లో .... నాకు ఇష్టం లేని నీకెంతో ఇష్టమైన వస్తువుల్ని గుర్తించి అవి కొంటున్నప్పుడు ఆ ఆనందం, ఆ ఆశ్చర్యం .... ఆ అద్భుతమైన మెరుపు నీ ముఖం లో, నీ కళ్ళలో ప్రతిబింబిస్తున్నప్పుడు .... ఆ మెరుపు కాంతుల్ని, నీ జీవితం తో ముడివేసుకునున్న నా జీవితం అదృష్టాన్నీ ఆస్వాదించాలని ఉంటుంది. నిన్నూ, పిల్లల్నీ తెల్లవారుజాము రెండు గంటలకే నిద్ర లేపి, మీరు తయారయ్యేలోపు క్యారియర లో అన్నీసర్దుకుని, కారు నడిపి, మీరందరూ కారు లో నిద్ర పోతే, నాలుగున్నర గంటల అవిరామ జర్నీ పిదప మిమ్మల్ని నిద్ర లేపి మిమ్మల్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచుతూ, నాగార్జున సాగర వద్ద .... మీతో కలిసి సూర్యోదయం వేళ ను చూసి ఆనందించాలని, ఎత్తిపోతల వద్ద .... పిల్లల ఆనందం కేరింతల్ని చూసి పిదప అందరికీ ఇష్టమైన చేపల కూర కలిసి తినాలని ఉంటుంది. ఎప్పటికప్పుడు నీవు ఆశ్చర్యపోయేట్లు ఏదో ఒకటి చెయ్యాలని .... నీకూ, పిల్లలకూ జీవితం మీద ఉత్సాహం, ఆసక్తిని పెంచాలనుంటుంది. ఈ ఆలోచన ఖర్చుతో కూడుకున్నదే అయినా, అందులో ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమీ లేకపోయినా .... మన బంధం, మన అన్యోన్యత పరిపక్వమయినదే అయినా ఎందుకో డబ్బు మీద మమకారాన్ని పెంచుకోవాలనుండదు. మనుష్యులు మమతల స్థానం వస్తుతుల్యం చెయ్యాలనుండదు. 03 FEB 2014, MON 0100 PM

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k2NrPT

Posted by Katta