బసవి ----------- ఆమెప్పుడు నవ్వగలదు? ఆమెప్పుడు నడవగలదు? మాట్లాడగలదు? అందరిలాంటి మనిషిగా జీవించగలదు? చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను చెట్టుబెరడు లాంటి శరీరం భావరహితమైన గాజు కళ్ళు ఆకలితో అలమటించే ఒళ్ళు పగలంతా వెలివేత రాత్రంతా జాగారం ఊరందరి ఆకలిని ఊరంతటి అమానుషత్వాన్ని మదమెక్కిన పిశాచుల క్రౌర్యాన్ని శరీరమున్నందుకు ఆడదానిగా అవయవమున్నందుకు మరల మరల మరల మరలా ఆమె చిన్నభిన్న మౌతూనే ఉంది వావి వరసలు లేనిఊరుమ్మడి బతుకామెది జోగుతున్న వ్యవస్థలో జోగిని'' ఆమె ఏ ఇంట్లో చావుమేళం మోగినా ఆమె తాగి ఆడాల్సిందే ఎవడెక్కడ చెయ్యి పెట్టినా ఎవడెప్పుడు అనుభవించినా అడ్డు చెప్పకుడదన్నదే ఊరి నీతి! కట్టిన గజ్జెలు మోగుతూనే ఉన్నాయి పుట్టిన పిల్లలు దోపిడీకి గురవుతూనే ఉన్నారు అందరి అందరందరి వీర్యాల చిత్తడిలో ఆమె లుకలుకలాడే పురుగులు తింటున్న శరీరంతో హీనంగా,హేయంగా,దీనంగా మనమున్దింకా నిలబడే ఉంది నెమ్మది నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తోంది మీరూ,నేనూ, మనమూ కలిసి జోగిని' ని మనిషిగా జీవించనిద్దాం! మహారి,నాటి,మురళి,తెవార్, డియార్,బసవి,జోగిని, పార్వతి,ముత్తామ్మ, తామమ్మ,-పిలుపేదైతేనేం? భాషేదైతేనేం, ప్రాంతమేదైతేనేం మన ముందే కాలుతున్న శరీరంతో ఆమె కూలుతున్న శరీరంతో ఆమె- ఆమెప్పుడు హాయిగా నవ్వగలదు? ఆమెప్పుడు ధీమాగా నడవగలదు? స్వతంత్రంగా మాట్లాడగలదు? మనిషిగా జీవించగలదు? మనమందరం మనుషులుగా ఆలోచించినపుడు ఆమె హక్కులకై పోరాడినప్పుడు ఆమె కూడా నవ్వగలదు.
by ShilaLolitha Poet
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sHxLSe
Posted by Katta
by ShilaLolitha Poet
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sHxLSe
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి