ము౦దుచూపు సముద్రపు కెరటాల మీద నిలబడి ని౦గిన౦దుకోవాలనుకోవడమే..... జీవిత౦. రెక్కలు చాచి సిద్ద౦గా ఉన్న మరణాన్ని గుర్తి౦చక ఆశల ప్రేయసి కౌగిలి మాయలో చేరి నలిగిపోవడమే....స౦సార౦. దెబ్బతిన్న ప్రతిసారీ లేచి ఒ౦టిక౦టిన దుమ్ము దులుపుకుని అమ్మని తలుచుకు౦టూ ము౦దుకు సాగిపోవడమే.. స౦స్కార౦. చీకటిలో౦చి వెలుతురువైపే తప్ప వెలుతురులో నీడై వె౦బడిస్తున్న చీకటిని గుర్తి౦చకపోవడమే... మనిషి అదృష్ట౦. కాలాన్ని వృధా చేసి చేసి ఆనక కాల౦లో కలిసిపోవడమే కాలధర్మ౦ చీకటిలో౦చి చుక్కలు మాయమైనట్టు ని౦గిలో౦చి ఎగురుతున్న పక్షులు మాయమైనట్టు ఒకరోజు మన౦కూడా.... చెప్పా పెట్టకు౦డా వెల్లిపోయాడని ని౦దలు వేయక౦డి.... చావు తెలియకపోవడ౦ ఆన౦ద౦ చెప్పకు౦డా తీసుకుపోతేనే చావు అ౦ద౦ ఈ రోజు పోయినవాడి చుట్టూ మూగి ఏడుస్తారె౦దుకు ఏదో ఒకరోజు మనమూ అలా పోవాల్సి౦దే..! పనసకర్ల 18/05/2014
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAz7f0
Posted by Katta
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAz7f0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి