పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మే 2014, ఆదివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఇప్పుడిలా నేను... నేను చూశాను ! ఒక నిస్తేజమైన ఆలోచన మస్తిష్కంలో జనించినపుడు మనోకుడ్యాల్లో ఉత్ఫన్నమయ్యే వెలుగు రేఖలు మసకబారడాన్ని... నేను విన్నాను ! ఒక ఉత్తేజమైన పగటికల ఉవ్వెత్తున ఎగసినపుడు కంటి పొరల్లో అలికిడయ్యే నిశ్శబ్ధ కాంక్షల కోలాహలాన్ని... నేను స్పృశించాను ! ఒక సమ్మోహన వీచిక గంభీరంగా వాలినపుడు బాహ్యాంతరాల్లో భారమయ్యే నిభిడీకృత బహు భావాలని... ఇప్పుడు చూడటానికి ఏ దృశ్యం కనిపించడంలేదు మసక మబ్బులో మెరిసే మిణుగుర్లు తప్ప ! వినడానికి ఏ శబ్ధం కర్ణబేరిని తాడంలేదు గుండెలో అలజడయ్యే నిర్మానుష ఘోష తప్ప ! స్పృశించడానికి ఏ అణువూ మిగలడంలేదు శున్యమైన మనస్సాక్షితో శాస్విత కౌగిలి తప్ప ! 18-5-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrQkds

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి