సాహితీ సీమలో అక్షర 'సేద్యగాడు'కొండ్రెడ్డి 13:40 - May 11, 2014 -22:23 మనిషి జీవన మూలధాతువై మనుగడ సాగిస్తున్న పల్లెపై ప్రాణాంతక పక్షేదో వాలింది పట్టణ సంస్కృతుల రెట్టలతో నాపల్లె స్వరూపాన్నే మార్చి కూలితల్లిని చేసింది నేలతల్లి చనుబాల సస్యానికి కాలం చెల్లినట్లుంది బేతాళ మాంత్రికులు నేతలై కూర్చుంటే ఇప్పుడు నేలరాలేది బడుగురైతు తలపాగా కాదు భరతమాత తిలకం అంటూ బలమైన అభివ్యక్తితో రైతు ఇతివృత్తంగా 'దుక్కిచూపు' లాంటి అద్భుత కావ్యాన్ని తెలుగు సాహిత్యానికందించిన అభ్యుదయ కవి, సాహితీ విమర్శకులు, సమీక్షకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. అభ్యుదయ హృదయంగా, సమసమాజమే ధ్యేయంగా, మార్క్సిజమే మార్గంగా, నీతి, నిజాయితీ, నిర్భీతే జీవితంగా, కవిత్వమే ఊపిరిగా జీవిస్తున్న సాహితీమూర్తి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. అక్షరాల్లో అగ్గిరవ్వలు విరజిమ్ముతూ.. అభ్యుదయ భావాల లావాలను వెదజల్లుతూ.. గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో సంచలన రచయితగా, కవిగా, విమర్శకునిగా వెలుగొందుతున్న కొండ్రెడ్డి 1944 డిసెంబర్ 12న ప్రశాశం జిల్లా బుద్ధిరెడ్డి పల్లెలో జన్మించారు. తల్లికోటమ్మ, తండ్రి సుబ్బారెడ్డి. కొండ్రెడ్డి ఎన్నో పుస్తకాలు రాశారు. అందులో 'మట్టితడి బంధాల్లో' 'అంకుర స్పర్శ', 'దుక్కిచూపు', 'ఆకాశమంత చూపు' లాంటి కవితా సంపుటాలతోపాటు 'సంస్పర్శ', 'ఆలోకనం' లాంటి సాహితీవిమర్శలు, సమీక్షలు, 'చిగిరింతలు', నానీలు, 'విలక్షణనేత్రం' లాంటి పద్య కావ్యాలు రాశారు. సమర్థుడైన సృజనకారుడు ఏప్రక్రియలోనైనా రాణించగలడని ఆయన చెప్పడమేగాక నిరూపించాడు. కొండ్రెడ్డి సాహితీ కృషికి గాను ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2007లో విష్ణుబొట్ల ఫౌండేషన్ అవార్డు, 2008లో 'ఆటా' అవార్డు, అవంత్స సోమసుందర్ లిటరరీ అవార్డు, రాజరాజేశ్వరి అవార్డు, రమ్యసాహితీ సమితి తదితర సాహితీ సంస్థల అవార్డులెన్నో అందుకున్నారు. ఈ కవికావ్యాలపై మద్రాస్, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసి ఎంఫిల్, పిహెచ్ డి పట్టాలు కూడా పొందారు. విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 70 ఏళ్ల వయసులోనూ నిరంతర సాహితీ అధ్యయనం, అక్షర సేద్యం చేస్తున్నారు. కొండ్రెడ్డి సమాజవాద మార్గానుయాయి. కట్టమంచి వారసుడు. ఆయన సాహిత్య విమర్శలోనూ ఆ లక్షణం కనిపిస్తుంది. వర్తమాన సాహిత్య విమర్శనారంగంలో అనేక సందర్భాలలో ధైర్యంగా మాట్లాడుతున్న విమర్శకుడు అంటూ ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి కొండ్రెడ్డికి కితాబిచ్చారు. http://ift.tt/1lyJJuJ
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyJJuJ
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyJJuJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి