పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మే 2014, ఆదివారం

Bharathi Katragadda కవిత

అక్షరశిల్పం పాతకాగితమే కదా అని నన్ను పారేయకండలా! అపురూపంగా చూడండొక్కసారి! గుండెగదుల్లో దాక్కున్న ఙ్ఞాపక పరిమళాలేవో మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తాయి! అద్భుతమైన అక్షర నిధులేవో మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాయి! ఏనాడో మర్చిపోయిన బాల్యం నిన్ను పలకరించొచ్చు. మరేనాడో పారేసుకున్న యవ్వనపు తీపి గుర్తులు పలకరించొచ్చు! మనసులో గుప్తంగా దాచుకున్న ప్రియురాలి మధురిమలు పలకరించొచ్చు. మనసుని హత్తుకున్న ఇల్లాలి మురిపాలు పలకరించొచ్చు! తండ్రి ప్రేమగా దండించిన అపూర్వ క్షణాలు పలకరించొచ్చు ! అమ్మ ఆర్తిగా అదుముకున్న మధుర క్షణాలు పలకరించొచ్చు! బడి డుమ్మా కొడితే దండించిన గురువు పలకరించొచ్చు! తాతయ్య నానమ్మల చందమామ కథలు పలకరించొచ్చు! అందుకే ఈ అక్షర శిల్పాలను ఒక్కసారి మనసారా సృశించండి! పోగొట్టుకున్న అపూర్వ పెన్నిధేదో దొరకవచ్చు ఆర్తిగా మిమ్మల్ని పెనవేసుకుపోవచ్చు!! భారతీరాయన్న 18.5.14.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t61zdf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి