పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మే 2014, ఆదివారం

Rakshita Suma కవిత

రక్షిత సుమ || ఒక్క సమిధ వెలిగినా చాలు || ధైర్యం ఆరిపోతేనే పిరికితనం చీకటి ఆవరిస్తుంది. నమ్మకం చిగుర్లు రాకపోతేనే అశాంతి మోడుగా నిలబడుతుంది. పగలు పలకరించకపోతేనే రాత్రి పరిచయంలోకొస్తుంది. వేడంటూ జ్వలించకపోతేనే చల్లదనం రాజ్యమేలుతుంది. ఎంతటి అంధకార మధాంద చక్రవర్తివైనా ఓ గుడ్డి వెలుతురినైనా తరిమేయగల చిన్న చీకటి దీపం వెలిగించు చూద్దాం...? శబ్ధపు ప్రకంపనలేవీ లేకుంటేనే నిశ్శబ్ధానికి నెలవుంటుంది నీవెంత పీకల్ని నొక్కేయగల ఉక్కుపాదపు అధికారివైనా ఒక్క గుసగుసను చిద్రం చేసే నిశ్శబ్ధాన్ని తరంగంలా పుట్టించు చూద్దాం.... చేపకు జీవంలేనప్పుడే ప్రవాహం ఈడ్చుకుపోతుంది మనిషికి ఆశ శ్వాసగా లేనప్పుడే చీకటి గుహలు మింగేస్తుంటాయి.... ( నా కవిత్వానికి ధైర్యం చెపుతూ, సహృదయంతో కవిసంగమం వేదిక పై నా కవితలను వినిపించే అవకాశం కల్పించిన అందరికీ పేరుపేరునా నమస్సులు తెలియజేసుకుంటున్నాను.)

by Rakshita Suma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gUwW37

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి