పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మే 2014, ఆదివారం

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

రాతిరేల రోడ్డుపక్క రాజాల కూసుంటే రమ్మేసిన పోలీసోను ఈలేసి ఇటు రమ్మనె.. ఎందుకనో పిలిసిండు దొరని దిగాలుగ దరికి పోతె దబాయించి దరినున్న దుడ్డుకాస్త లాక్కపాయె.. చేసెడిదిలేక చేతులూపుకు చేరిన నా రూములోకి నాయెనకే నక్కిన నా దోమబిడ్డల ఓదార్చిన ఆలౌటును రేపు కొనిస్తనని.. నిదర అన్న పోదమంటె కునుకన్న రాదాయె కల్లల్లొ నీల్లు తప్ప కలల్లేవు గిలల్లేవు.. గుండెపైన నిదరోయిన నాదాని సూడలెగాని పక్క పక్కల పండిన పోరగాడి పంతులమ్మ యాదొచ్చె.. అసలె గయ్యాలి.. రేపు నా సంటోడ్ని ఎస్కూల్ల కూస్సోనియ్యకుంటే ఏం సెయ్యాలె.. నా కైతే సమజైతలే.. పగలంతా పక్కకేసిన పైకమంతా పోలీసోడు పీక్కపాయె.. ఇంటితాన ఎదురుసూసిన ఇల్లాలికి గసిన్ని పూలైనా తేకపాయె.. గా దేముడు గూడకా యా ఉన్నోళ్ళ గులామనుకుంట ఆల్లేమడిగితె అదిస్తుండు... నేనడక్కుందగనే ఇన్ని కట్టాలిచ్చిండు.. ఎవనితోని సెప్పుకోను, ఎవనితోని మొత్తుకోను.. పొద్దు పొడిచి ఊరంతా ఇంటిలంగ పడతంటే కట్టుకున్న దాని ఏడుపు నే ఇనలేను.. నా కడుపున పుట్టినోడి కన్నీటిని సూడలేను.. ఇక సూదలేని ఈ కల్లకు ఈ లోకంల పనిలేదు.. అందుకే మూస్తన్నా.. కన్ను మూస్తన్నా.. - సత్యం జి, 18-05-2014, 01:29

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpLZHR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి