అమర కీర్తన సేతము రారండి - కాసుల ప్రతాపరెడ్డి అక్షరం పచ్చెలు పచ్చెలై వెక్కిరిస్తూ ఉంటది గాయాల మీద ఒక ముద్దు చాలు మెత్తని పెదవుల మీద తడిముద్దు అమృతం కన్నీళ్లను దోసిలి పట్టి తాగడం ఒక సాహసం పదాలు ఎదురు తిరిగి గుండె మీద తంతయి విషాదం గొంతు దాటి కడుపులకు జారుతది నన్ను నేను నిలువునా చీల్చుకుని మళ్లీ అతికించుకుంటా ఉపాయాలూ ఎత్తుగడలూ వ్యూహాలూ తిప్పికొట్టడాలు క్షణం తీరిక లేని జీవితాలు భూములను చాపల్లా చుట్టి ముడ్డికిందేసుకుంటారు గూడూ కట్టిన చీకట్ల గుడ్లు తేలేస్తం నోరు పెగలదు, చేతులాడవు వీరుడెంత సేపూ వీరుడే మృత్యువును వీలునామా చేసింతర్వాత అమరగానాన్ని ఆనవాయితీ చేసింతర్వాత మనం జీవించడానికి కాపాడుకోవడం ముఖ్యం కాకపోయింతర్వాత పాత చరిత్ర కట్టెదుట దయ్యంలా మళ్లీ మళ్లీ నిలబడుతది ప్రపంచాన్ని కోత పెడుతూ వుంటది జీనా యాహాఁ మర్‌నా యాహాఁ గూడు కట్టిన విషాదంలో సాలెగూళ్లు పెరుగుతుంటయి వలలు దేహాలనూ స్వప్నాలనూ గురి పెడతయి విత్తులు చల్లితే పంటచేలు పచ్చనిల్లవు కొసదేరిన కత్తులూ కటార్లు మొలుస్తయి పిట్టలు ఎగురుతూ ఎగురుతూ అకస్మాత్తుగా నెత్తురు కక్కి నేల రాలుతయి సౌడు నేలల మీద పచ్చగడ్డి ఎక్కడిది మంచి నేలంతా వాడెవడి గుప్పిట్లోకో పోతది తెలంగాణ ఒంటి మీద రాకాసి పుండు చురకత్తితో ఒక్కటే గెలుకుడు తొండి చేసి తప్పించుకునుడు తెలువది పోరాటం గంజితో పెట్టిన విద్య త్యాగాలతోటి చరిత్ర పుటలు పెంచుతుంటం అమరత్వ కీర్తన ఆచారమై గడ్డ కట్టి పోతది రాజు వెడలెర సభకు రవి తేజములలరగ భుజకీర్తులతోటి ఊరేగేవాళ్లు ఊరేగుతుంటరు నెత్తుటి చారలు అచ్చులు కడతయి గెలుపు ఆలోచన బుర్రల నుంచి చెరిపేస్తం పాడుకుంటూ పోవుడు తప్ప ఏదీ వద్దనుకుంటం శాపం పెట్టినవాడెవడో ఎంతకీ దొరకడు ఆకులు రాల్చడమే తప్ప చిగుళ్లు వేయడం నేర్వం మెడ మీద కత్తి పెట్టినా మాట్లాడుతం, పోట్లాడుతం, నేలకొరుగుతం చూడు చూడు మల్లన్న, చూడవోయి మల్లన్న ఎగురెగురు మల్లన్న, ఎగురవోయి ఎల్లన్న కాడి దించొద్దు, కన్ను మూయొద్దు అడవులనే కాదు, శిశిరాలనూ మోద్దాం
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRtor
Posted by Katta
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRtor
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి