పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మే 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

।। పాపం చెట్టు ।। ---------------------- ఒక చెట్టు మొలిచింది నేల తల్లిని క్షోభపెట్టి నిలువెత్తు వట వృక్షమై నిలిచి .. భూసారాన్ని పీల్చుకుని తన రక్తంలో కలుపుకుని వొంటినిండా మధుర ఫలాలను పండించి పేర్చుకుంది సువాసనలతో.. ఇంతలో అటుగా వచ్చాడు నారూ ,నీరూ పోయని వీరుడు రాళ్ళతో ఒక్కొక్క పండునీ నేల కూల్చాడు చెట్టుకి సరిహద్దులు గీసి.. కొమ్మలకు గాయాల్ని చేసి పోయాడు. పచ్చని ఆకుచీర కట్టినట్టు విరగబూసింది లక్షలాది ఆకులను కొందరు అటుగా వచ్చారు అవసరమో.. అనవసరమో .. కనికరం లేకుండా ఆకులన్నీ తెంచి కొమ్మలను మోడు చేసిపోయారు. గువ్వల గుంపు అటుగా పయనిస్తూ విడిది చేసాయి ,సేద తీరాయి ,ముచ్చట్లు చేసుకున్నాయి కానీ చెట్టు శాశ్వత నేస్తం కాదుకదా అందుకే పోతూపోతూ తమ వ్యర్ధాలతో పాడుచేసి ఎగిరిపోయాయి . భీకర తుఫానుగాలి వీచింది వేళ్ళు సైతం బయటికొచ్చేలా చిటారు కొమ్మలు నేలను తాకి మళ్ళీ పైకి లేస్తున్నాయి అయినా ఆ చెట్టుకు మరణం రాలేదు . ఓ దుర్మార్గుడు మళ్ళీ అటువైపుగా వచ్చాడు తన అవసరాన్ని.. వెంట తెచ్చుకున్న కత్తికి చెప్పాడు నిర్దాక్షణ్యంగా చెట్టుని నరికాడు వేళ్ళతో సహా పెకిలించాదు చివరికి నేల కూలింది ఆ చెట్టు (18-05-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jIzn8V

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి