శ్రీమతి సింగిరెడ్డి శారదగారు డల్లాస్ లో TANTEX (telugu association of north texas)సాహిత్య కార్యక్రమాల కన్వీనరుగా పరిచయమయ్యారు.తొలి పరిచయభాషణ లోనే వారికి మావూరికి గల అవినాభావ సంబంధం గురించి తెలిసింది .ఆమె చిన్నతనాన ఎలగందుల బస్టాండులో వాళ్ల కోసం సిద్ధంగా ఉన్న సవారి కచ్చురం లో వాళ్ల అమ్మమ్మ గారి ఊరైన జవారి పేటకు పోయిన సంగతి గుర్తు తెచ్చుకుని మురిసి పొయ్యారు.ఆ వూరికి మాఖిల్లా ముందునుంచి వెనక్కు వెళ్లి మానేరు దాటి పోవాల్సి వచ్చేది.ఇప్పుడు వాగు పోయి మానేరు డ్యాం ఏర్పడ్డ తరువాత ఆ రాక పోకలన్నీ బంద్. వాగు గురించి రాయమన్న వారి అభ్యర్థన మేరకు ఆవేదన పొంగి అక్షరాల వాగు ప్రవహించింది. వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! గల గల పారేటి గంగమ్మ మానేరు జల జల జారేటి జాబిల్లి మానేరు ఒడ్లొరిసి పారేటి ఓదార్పు మానేరు వరిమళ్లు దడిపేటి వరలచ్మి మానేరు వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! యాసాడ గైనంటే యాదే లేక పాయె గన్నేర్వరం తొవ్వ గంగలగల్సి పాయె ఉరగాల్వ ఊసు ఉత్తదే ఐపాయె పెద్దకాల్వ సొగసు పేరుకే లేదాయె వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! వాగావలూళ్లన్ని వలసకేళ్లీ పాయె మిగిలిన ఊళ్లకు సుట్టు దిరుగుడాయె బండ్ల తొవ్వలు బాయె బస్టాండు కళవాయె పాత రోజులన్ని కలలోనే గనుడాయె వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! Vaadhoolasa 18/5/14
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3t7h9
Posted by Katta
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3t7h9
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి