లెక్క_లేక ఆనాగానాగ ఇంకా పేరుపెట్టని కనిపించని తెలియని రెండు గ్రహాలు అసలుండేవి కావు!! అవి రెండూ ఒకదానికొకటి ఉపగ్రహమని భావించుకుంటూ దేనిచుట్టదే తిరక్కుండా ఇంకో దాని చుట్టూ కూడా తిరక్కుండా తిరక్కుండా లేవు!! అసలు వాటికి రాని conflict ఏంటంటే అవెందుకు లేవోనన్న doubt!! లేకపోతే మునిగిపోయేదేంలేదన్న సంతోషంలో అవి లేకుండగా అనుకోకుండా సున్నా రోజున ఒక గ్రహానికి తెలియకుండా ఇంకొకటిగా రెండూ ఉండటం మొదలెట్టాయ్ తిరగటం మొదలట్టాయ్ ఎక్కడ తిరుగుతున్నాయో తెలీకుండా దేనికదే అది మాత్రమే ఉందనుకుంటూ!! ఉండిపోతే మునిగిపోయేదేముందన్న సంతోషంలో అవుండగా అనుకోకుండా అదే సున్నా రోజున రెండూ ఎదురుపడ్డాయ్ రెండూ ఉన్నాయని రెండిటికీ తెలిసింది ఇప్పుడు వాటికొచ్చిన conflict ఏంటంటే తానొకటే అనికూడా అనుకోని రెండిటికీ ఇంకోటుండటం వల్ల రెండవటం!! ఎందుకు లేవో తెలీదు..ఎందుకున్నాయో తెలీదు ఉన్నా లేకున్నా మునిగిపోయేదుందోలేదోనన్న సందేహంలో అవి రెండూ తిరగడం మానేసాయ్.. ఉండటానికి లేకపోడానికి తేడా ఏంటని అక్కడే తిరగడం మానేసున్న సున్నా రోజునడిగితే అప్పుడదడిగింది లేనందుకు లేని doubtlu ఉన్నందుకెందుకని!! ఒకటవ్వని ఆ రెండూ ఏం అర్థం చేస్కున్నాయో ఏమోకానీ అప్పట్నుండీ ఒకదానికొకటి ఉపగ్రహమని భావించుకుంటూ దేని చుట్టదే తిరుక్కుంటూ ఇంకో దాని చుట్టూ కూడా తిరుక్కుంటూ ఆ రోజులోనే ఉన్నాయ్ ఒకటి , రెండు , సున్నా లేకుండా !!_____(9/5/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oconYR
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oconYR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి