పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మే 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

డా|| ఎన్‌ గోపి కవిత || ప్రక్రియ|| పెన్ను తానే రాస్తున్నానంటుంది రాయించేది నేనే అని అహంకరిస్తుంది చెయ్యి! ప్రియురాలి ప్రేమలా పరుచుకుంటుంది కాగితం ద్రవరూపంలో వున్న సిరా అక్షర విన్యాసాలను ఊహిస్తుంది! అన్నీ సిద్ధమే కాని పద్యంకోసం ఆవాహన ఎక్కడ తిరిగుతుందో యేమో ఎప్పుడొస్తుందో తెలియదు మనసా! నీకు తెలుసా!! పెన్నుది బంగారు పత్తి అయితే అక్షరాలు బంగారమౌతాయా? కత్తిపట్టి యుద్ధాలు గెలిచిన చెయ్యి పెన్ను మొరాయిస్తే చేసేదేంలేదు! ప్రియురాలు రక్తహీన హాసాలు చిందిస్తుంది సిరా సముద్రం గడ్డకట్టుకపోతుంది! అయినా కవిత్వం గాలిలా వ్యాపిస్తుంది, ధూళిలా యెగిసిపడుతుంది, ఒక నిరాఘాట నిరంతర ప్రక్రియకు తెరలేస్తుంది! ఉభయ సంధ్యలో కలగాపులగమౌతాయి, ఆకాశానికీ, సముద్రానికీ మధ్య భేదం చెరిగిపోతుంది, అనంతమైన వైశాల్యం అంగవస్త్రమై భుజం మీద వాలుతుంది అతీతమైన సంవేదన ఆరని జ్వాలై మండుతుంది మంట వెలుగులో సమస్త వర్ణాలన్నీ సువర్ణమౌతాయి. ---------------------------------9.5.2014---------------- సాహితీ స్రవంతి సాహిత్య పత్రిక పేజి 84 జూలై-ఆగస్టు 2011

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RwsrVZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి