పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మే 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || వేసవితో వాదం!|| వేసవితో వాదం అందరి తరఫున వకాల్త పుచ్చుకున్న నేలతల్లికి వందనం! '' ఎంత తీక్షణుడవైతే క్షణం కూడ వ్యవధివ్వకుండా నాలోని జలరాశిని ఆసాంతం ఆపోసనపట్టి నీవొక్కడివే లాగేసుకుంటే యెలా? జీవరాశుల దప్పిక రోదన చూడవయ్యా సప్తారథగమనానంద పురుషుడా! '' దాడికి లేదా వాదానికి దిగింది ధరిత్రి! '' తాపానికి తాళలేక, నా వేడికి నేనే చావలేక దాహంతో ఆస్వాదించినా, నా పిడికెడు పొట్టలో ఆ కడివెడు పట్టవుగా వల్లూ చల్లబరచుకుని మిగిలినది జలధరుడితో పంపుతాలే పో ఈ లోగా యేం కొంపలు మునగవు! '' అంటూ పొగరుగా వడగాలి జవాబు! '' జనాలకు గొతెండుతోంటే ఎకసెక్కంగా వుందా బాబ్బాబు పార్వతి చాలు గంగను విడువమనగానే కరుణించిన శివుడే నయం! నువ్వు మరీ పడమటి దేశపు గాలిసోకినవాడివికదా! మరీ మండిస్తున్నావు! నిద్రించేది సహ్యాద్రిలోనే కదా! గ్లొబరీకరణతో కిరణాలు ప్రపంచీకరించబడ్డయిగా! ముసలీ ముతక, లేలేత మొగ్గలనీ పాడెక్కిస్తున్నావు '' ధరిత్రీ ధర్నా మొదలెట్టింది! ** దాని ప్రభావం - మారుతం షికారు ప్రారంభమైంది కామోసు ఆకాశంలో నల్లటి మబ్బు దబదబా గుండెలు బాదుకుంటోంది ఎవరో చేసిన హడవుడికి నాకేమీ తెలియదన్నటు బిక్కమొగమేసి, చెల్లాచెదరై దారి తప్పి జారిపడితున్నాయి సన్నగా చినుకులు! తలలూపుతూ తరువులూ కిలకిలనవ్వుతూ, నేలంతా పులకింత మట్టివాసన నలుదిశలా జీవరాశి కేరింత! పోరాటం అనివార్యం ఎప్పుడైనా ఎక్కడైనా! ** 8.5.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivkf2Q

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి