తెల్లారింది కళ్ళు తెరుచుకున్నాయి హోరుగాలిలో ఎగిరెగిరి నేలపైకి వాలను. పొట్ట లోని చీకటి నుంచి కంటి ముందు చీకటి వరకు నల్లతాచులా పాకుతున్న రాత్రిని చూశాను. చీకటి కెరటాల నాల్కలు చాచిన రాత్రి ఆశల తెప్పపై తుఫానులో ఎండుటాకు రెండుకాళ్ళే తెడ్లుగా ఎదురీత... గడ్డకట్టిన నిశ్శబ్ధం కంటిలో గుచ్చుకుంటున్న చీకటి ఆశల పూలే ముళ్ళుగా కుంభవృష్ఠి... మళ్ళీ అంతా మామూలే రోడ్డుపై నడిచేది నా కాళ్ళే దప్పికేస్తే ఎండను తాగడమే ఆకలి తింటూ బతకడమే ఓటు మంత్రదండం ఊపేశాను రాలిపడ్డ భ్రమల చింతలు ఏరుకోవడమా? ఈ చీకటి సముద్రంలో మిణుకుమిణుకు మనే అక్షరాల వెంట నడవడమా?
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nm5PVV
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nm5PVV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి