పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మే 2014, శుక్రవారం

Bharathi Katragadda కవిత

కాగితంపూలు అనుబంధాలన్నీ నేడు కాగితం పూలైపోతున్నాయి! ప్రకృతిసిధ్ధమైన పూలపరిమళాలు సైతం నేడు కలుషితమైపోతున్నాయి! స్వార్ధపు గాలులతో చల్లని స్నేహపరిమళం సైతం నేడు తన సహజత్వాన్ని పోగొట్టుకొని వెలవెలబోతుంది! మానవసంబంధాలన్నీ గిరిగీసుకొని పలకరిస్తే పాపమన్నట్లుగా మూగబోతున్నాయి. ఆప్యాయతానురాగాలతో కూడిన కమ్మని పిలుపులు సైతం ఆంటీ,అంకుల్, బ్రో అనే తడిపొడి మాటల్లో పడి అర్ధాలే మారిపోతున్నాయి! పాశ్చాత్యపోకడలతో హలో అంటూ జారుకుంటున్నాయి! చందమామ కథలతో బొమ్మరిల్లు బొమ్మలతో బుజ్జాయి మాటలతో జోకొట్టే నానమ్మలు,తాతయ్యలు నానీలు,గ్రానీలు అయిపోయి పాపం వృధ్ధాశ్రమాల్లో సేదదీరుతున్నారు గాయపడిన హృదయాలతో! కోల్పోయిన అనుభూతులతో!! కంప్యూటర్ యుగం అతివేగంగా మానవసంబంధాల్లోకి యాంత్రికంగా అడుగుడి సెల్లుల పర్వంతో,వాట్సపుల జోరుతో చాటింగుల సహవాసంతో కాస్తో కూస్తో ఉన్న అనుబంధాలకి తాళం వేస్తుంది! ఇక చేతి వేళ్ల కదలికలే మాటలవుతున్నాయి! టి.వ్. కంప్యూటర్లే మనుషులవుతున్నాయి!! అన్నీ చూస్తూనే వున్నాము. అందరమూ చూస్తూనే వున్నాము!! అయినా మార్పులేని వ్యవస్థ మనది కదూ! అయినా సరే మార్పుకై ఒక అడుగు వేద్దాము! రేపు మరో పదడుగులు తోడు కావొచ్చు! ఆ అడుగులతోనే కాగితంపూలని సువాసనలు వెదజల్లే సుమాలుగా మారుద్దాం!! భారతీరాయన్న 09.0514.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2RMCI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి